ఇప్పుడు సోషల్ మీడియాలో బ్రతికున్నోళ్ళని చంపేసి సంతాపం తెలియజెయ్యడం అనేది ఫ్యాక్షన్ అయ్యిపోయింది. మొన్నామధ్యన చంద్ర మోహన్ చనిపోయారంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది ఆయన స్వయంగా తాను బ్రతికున్నాను అంటూ వివరణ ఇచ్చుకున్నారు. రీసెంట్ గా కోట శ్రీనివాసరావు గారు చనిపోయారంటూ సోషల్ మీడియాలో ఓ వార్త ప్రచారంలోకి రాగా.. పోలీసులు కూడా బందోబస్త్ కోసం కోట గారింటికోచ్చేసారు. తర్వాత కోటాగారు ఈ రూమర్స్ పై ఓ వీడియో షేర్ చెయ్యాల్సి వచ్చింది.
ఇప్పుడు కమెడియన్ సుధాకర్ చనిపోయాడంటూ మరో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సుధాకర్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన ఆరోగ్యం విషమించడంతో సుధాకర్ చనిపోయాడంటూ కొంతమంది ఆ న్యూస్ ని స్ప్రెడ్ చేసారు. కొన్ని వెబ్ సైట్స్ లో, యూట్యూబ్ ఛానల్స్ లోను సుధాకర్ మరణవార్త ప్రచురితమవడంతో ఆయన అభిమానులు కాస్త కంగారు పడుతున్నారు.
కానీ సుధాకర్ మరణ వార్తలో ఎంతమాత్రం నిజం లేదు. సుధాకర్ పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని సన్నిహితుల సమాచారం. ఇది చూసిన ఆయన ఫాన్స్ ఆరోగ్యంతో ఉన్న వ్యక్తిని చంపెయ్యడం భావ్యమా.. అది కూడా ఆ న్యూస్ వైరల్ చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారు. సిగ్గు లేదా మీకు అంటూ సుధాకర్ అభిమానులు ఈ ఫేక్ న్యూస్ పై ఫైర్ అవుతున్నారు.