అనసూయ భరద్వాజ్ వెండితెర మీద కాదు.. బుల్లితెర మీద కూడా సంచలనమే. బుల్లితెర మీద యాంకరింగ్ కి గ్లామర్ ని పరిచయం చేసి.. తన అందాలతో కామెడీ షో కే వన్నె తీసుకువచ్చిన అనసూయ ఎనిమిదేళ్లపాటు ఈటివి జబర్దస్త్ లో యాంకర్ గా మెరిసింది. మధ్య మధ్యలో అనసూయ కొద్దిగా బ్రేక్ తీసుకున్నా మళ్ళీ జబర్దస్త్ ని వదలకుండానే ఉండిపోయింది. కాని ఈసారి జబర్దస్త్ కి అనసూయ పూర్తిగా గుడ్ బై చెప్పేసింది. దానికి రాకరకాల కారణాలున్నాయి.
అనసూయ జబర్దస్త్ కి బై చెప్పగానే అమెరికాలో తేలింది. అక్కడ చాలారోజుల పాటు ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేసి వచ్చి ఇక్కడ ప్యాన్ ఇండియా మూవీస్ తో సత్తా చాటుతుంది. షూటింగ్స్ నుండి కొద్దిగా గ్యాప్ రాగానే ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేస్తుంది. ఇప్పుడు కూడా భర్త భరద్వాజ్ తన ఇద్దరి పిల్లలతో అనసూయ వెకేషన్స్ లో క్వాలిటీ టైమ్ స్పెండ్ చేస్తుంది. అనసూయ తన భర్త పిల్లలతో కలిసి స్విమ్మింగ్ పూల్ లో జలకాలాడిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఇక ఈ రోజు నది ఒడ్డున తన ఫ్యామిలీతో కలిసి బ్రేక్ ఫాస్ట్ చేస్తూ ఆ పిక్స్ ని షేర్ చేసింది. చిట్టిపొట్టి డ్రెస్సులతో తన కొడుకులతో కలిసి చిన్న పిల్ల మాదిరిగా ఎంజాయ్ చేస్తుంది అనసూయ. అనసూయ భర్త భరద్వాజ్ కూడా వీళ్ళతో చేరి సెల్ఫీలంటూ హడావిడి చేస్తున్నాడు.