నటుడు శరత్ బాబు ఈరోజు సోమవారం హైదరాబాద్ లోని AIG ఆసుపత్రిలో అనారోగ్యంతో కన్ను మూసారు. గత నెల రోజులుగా ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్న శరత్ బాబు ఈరోజు మృతి చెందారు. శరత్ బాబు మరణంతో టాలీవుడ్ ఇండస్ట్రీ దిగ్బ్రాంతికి లోనైంది. నిన్న మ్యూజిక్ డైరెక్టర్ రాజ్ మరణం నుండి తీరుకోకముందే శరత్ బాబు మరణవార్త టాలీవుడ్ ని కుదిపేసింది.
శరత్ బాబు చెన్నై, బెంగుళూరులోనే స్థిరపడ్డారు. టాలీవుడ్ మూవీస్ లో తరచూ కనిపించే శరత్ బాబు షూటింగ్స్ నిమిత్తం హైదరాబాద్ కి వచ్చివెళుతూ ఉండేవారు. ఆయన రీసెంట్ గా మళ్ళీ పెళ్లి మూవీలో నటించగా అది విడుడల కావాల్సి ఉంది. అయితే అనారోగ్యంతో బాధపడుతున్న శరత్ బాబుని కుటుంభ సభ్యులు బెంగుళూరు నుండి హైదరాబాద్ ఆసుపత్రికి తరలించగా.. నేడు పరమపదించారు.
అభిమానుల సందర్శనార్ధం శరత్ బాబు భౌతిక కాయాన్ని మరికొద్ది సేపట్లో ఫిలిం ఛాంబర్ కి తరలిస్తారని, రాత్రి 7.30 వరకు అభిమానుల సందర్శనార్ధం ఆయన భౌతిక కాయాన్ని అక్కడే ఉంచి.. తర్వాత చెన్నై కి అంబులెన్స్ లో ఆయన స్వగృహానికి తరలించి తదుపరి అంత్యక్రియలు రేపు చెన్నైలోనే నిర్వహిస్తారని శరత్ బాబు కుటుంభ సభ్యులు తెలిపినట్లుగా నటుడు మురళి మోహన్ మీడియాకి తెలియజేసారు.