నటుడు బ్రహ్మానందానికి ఇద్దరు కొడుకులు. ఒకరు గౌతమ్. గౌతమ్ హీరోగా నిలదొక్కుకోవడానికి ఇంకా ఇంకా ట్రై చేస్తున్నాడు. అతనికి ఇప్పటికే పెళ్ళై పిల్లలు ఉన్నారు. బ్రహ్మానందం తన మనవడితో స్పెండ్ చేస్తున్న పిక్స్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. బ్రహ్మి మరో కొడుకు సిద్దార్థ్. సిద్దార్థ్ విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నాడు. సిద్దార్థ్ కి వివాహం నిశ్చయం కాగా.. ఆదివారం నాడు సిద్దార్థ్ నిశ్చితార్థం గ్రాండ్ గా జరిగింది. హైదరాబాద్ లోని ఓ ఫంక్షన్ హాల్ లో సిద్దార్థ నిశ్చితార్థ వేడుక జరగగా.. పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.
హైదరాబాద్ కి చెందిన ప్రముఖ డాక్టర్ పద్మజ, వినయ్ కుమార్తె.. డాక్టర్ ఐశ్వర్యతో బ్రహ్మానందం చిన్న కుమారుడి సిద్దార్థ్ నిశ్చితార్థం జరిగింది. త్వరలోనే సిద్దార్థ్-ఐశ్వర్య పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు. ఎంగేజ్మెంట్ ని కొద్దిమంది సమక్షంలోనే సింపుల్ గా నిర్వహించిన బ్రహ్మి ఫ్యామిలీ.. పెళ్లిని త్వరలోనే హైదరాబాద్ వేదికగా ఘనంగా చేయనున్నారు అని తెలుస్తుంది. సోషల్ మీడియాలో సిద్దార్థ్ - ఐశ్వర్య నిశ్చితార్థం ఫొటోలు వైరల్ గా మారాయి.