Advertisementt

థియేటర్ ని తగలెట్టేసిన ఎన్టీఆర్ ఫాన్స్

Sun 21st May 2023 12:39 PM
ntr fans  థియేటర్ ని తగలెట్టేసిన ఎన్టీఆర్ ఫాన్స్
NTR fans damage many theaters with Simhadri re-release థియేటర్ ని తగలెట్టేసిన ఎన్టీఆర్ ఫాన్స్
Advertisement
Ads by CJ

ఎన్టీఆర్ పుట్టినరోజు స్పెషల్ గా ఎన్టీఆర్ ఫాన్స్ అంతా కలిసి ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ చిత్రం సింహాద్రిని రీ రిలీజ్ చేసారు. రీ రిలీజ్ కి కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించి, భారీగా ప్రమోషన్స్ తో సినిమాని నిన్న ఆయన బర్త్ డే రోజున విడుదల చేసారు. రీ రిలీజ్ చిత్రమైనా ఎన్టీఆర్ ఫాన్స్ హంగామాతో భారీ ఓపెనింగ్స్ తెచ్చుకుని 1000 థియేటర్స్ లో విడుదలై రికార్డ్ సృష్టించిన ఈ చిత్రాన్ని వీక్షించేందుకు ఫాన్స్ ఎగబడ్డారు. అంతటితో పండగ చేసుకుని సంబరపడకుండా సింహాద్రి విడుదలైన థియేటర్స్ లో బాణా సంచా కాల్చి హంగామా చేసారు.

అలా విజయవాడలోని అప్సర థియేటర్ లో ఎన్టీఆర్ ఫాన్స్ రచ్చ రచ్చ చేస్తూ థియేటర్ లోపలే బాణా సంచా కాల్చడంతో థియేటర్ తగలబడిన ఘటన వైరల్ గా మారింది. ఫాన్స్ అతి, వారి రచ్చ తో థియేటర్స్ లో పేల్చిన బాణాసంచా వలన థియేటర్ లోకి సీట్స్ కాలిపోయాయి. పోలీస్ లు రంగంలోకి దిగి ఫైర్ సిబ్బంది సహాయంతో మంటలని అదుపులోకి తెచ్చినప్పటికీ అప్పటికే థియేటర్ సగం కాలిపోయింది.

ఫాన్స్ ఉత్సాహం కాస్త అత్యుత్సాహంగా మారితే ఇలానే ఉంటుంది. ఎంత రచ్చ చేసినా అదుపుతప్పకూడదు. హద్దు మీరకూడదు.. లేదంటే ఇలాంటి ఘటనలే జరుగుతాయి. ఎన్టీఆర్ ఫాన్స్ ఎంత వైల్డ్ గా లేకపోతే ఇలాంటి సంఘటన చోటు చేసుకుంది. ఫాన్స్ కాస్త అదుపులో ఉంటే అందరికి మంచిది. 

NTR fans damage many theaters with Simhadri re-release:

Seats got burnt in the Apsara theater of Vijayawada

Tags:   NTR FANS
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ