యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు విమర్శల పాలవుతున్నారు. నందనమూరి ఫ్యామిలిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన నందమూరి తారకరకరామారావు గారి శతజయంతి ఉత్సవాల్లో పాల్గొనకుండా తప్పుకోవడంపై ఆయనపై విమర్శలు వెల్లువెత్తాయి. ఎన్టీఆర్ తాతగారి శతజయంతి ఉత్సవాలకు హాజరు కమ్మని కమిటీతో పాటుగా ఎన్టీఆర్ పెదనాన్న నందమూరి రామకృష్ణ స్వయంగా ఎన్టీఆర్ ఇంటికెళ్లి ఆహ్వానించారు. ఎన్టీఆర్ కూడా ఈ ఈవెంట్ కి తప్పక వస్తాడని పోస్టర్స్ వేసి.. టీవీల్లో స్క్రోలింగ్ నడిపించారు. కానీ చివరి నిమిషంలో ఎన్టీఆర్ తాను రావడం లేదు అంటూ ఓ మెసేజ్ పంపించారు.
కుటుంబంతో పుట్టిన రోజు జరుపుకునేందుకు ముందుగానే ఏర్పాట్లు చెయ్యడంతో ఆయన తాతగారి శతజయంతి ఉత్సవాలకు రాలేకపోతున్నట్టుగా మెసేజ్ పంపించారు. దానితో తాతగారి ఉత్సవాలకన్నా నీకు నీపుట్టిన రోజు ఎక్కువైందా.. జస్ట్ 30 మినిట్స్ వచ్చినా బావుండేది.. కానీ నువ్వు నందమూరి ఫ్యామిలిలో పుట్టి ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ నందమూరి అభిమానులు విమర్శిస్తున్నారు.
మరోపక్క ఎన్టీఆర్ కావాలనే బాబాయ్ బాలకృష్ణని తప్పించుకోవడానికే ఇలా ఈవెంట్ కి దూరంగా ఉన్నారని.. ఆయనని నందమూరి ఫ్యామిలీ పట్టించుకోదు.. అవసరం వచ్చినప్పుడు పిలిచి భోజనం పెడితే ఎవరు వస్తారు.. తారకరత్న మరణం విషయంలో ఎన్టీఆర్ ని నందమూరి ఫ్యామిలీ ఎలా ట్రీట్ చేసిందో చూసారా.. బాలకృష్ణ అయితే ఎన్టీఆర్ ని తప్పించుకు తిరిగారు. ఆయన ఎన్టీఆర్ ని కన్సిడర్ చెయ్యనప్పుడు ఎన్టీఆర్ మాత్రం ఎందుకు పట్టించుకుంటారు అంటూ ఎన్టీఆర్ ఫాన్స్ కూడా ఎన్టీఆర్ ని విమర్శించే వారిపై ఎదురు దాడికి దిగుతున్నారు.