యాంకర్ అనసూయ జబర్దస్త్ నుండి తప్పుకున్నాక సినిమా షూటింగ్స్ తో బిజీ అయ్యింది. ప్యాన్ ఇండియా మూవీస్ తో క్రేజీగా మారిన అనసూయ కాస్త బరువు పెరిగినా దానిని తగ్గించేందుకు వర్కౌట్స్ చేస్తుంది. భర్త భరద్వాజ్ తో కలిసి వర్కౌట్స్ చేసే అనసూయ ఈమధ్యన చాలా ఎక్కువగా ఫ్యామిలీతోనే కనబడుతుంది. అసలు జబర్దస్త్ నుండి బ్రేక్ తీసుకున్నది కూడా అనసూయ తన ఫ్యామిలీ కోసమే అన్నట్టుగా చెప్పింది. కొడుకులతో టైమ్ స్పెండ్ చెయ్యడానికే జబర్దస్త్ వదులుకున్నట్టుగా చెప్పింది.
నిన్న అనసూయ పెద్ద కొడుకు పుట్టిన రోజు. సోషల్ మీడియా వేదికగా కొడుకుకి శుభాకాంక్షలు తెలియజేసిన అనసూయ నేడు తన భర్త, పిల్లలతో కలిసి జలకాలాడుతున్న పిక్స్ ని షేర్ చేసింది. స్విమ్మింగ్ పూల్ లో కొడుకులు, భర్త భరద్వాజ్ తో కలిసి అనసూయ స్విమ్ చేస్తూ ఫొటోలకి ఫోజులిచ్చింది. అనసూయ స్విమ్ డ్రెస్ లో కత్తిలా కనిపించింది.
అనసూయ సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ ఉంటుంది. తరచూ ఫోటో షూట్స్ ని షేర్ చెయ్యడము, ఫ్యామిలీతో కలిసి స్పెండ్ చేసే ప్రతి మూమెంట్ ని అభిమానులతో పంచుకుంటుంది.