Advertisementt

వైరల్: హ్రితిక్ vs ఎన్టీఆర్ ట్వీట్స్

Sat 20th May 2023 04:48 PM
hrithik roshan,ntr  వైరల్: హ్రితిక్ vs ఎన్టీఆర్ ట్వీట్స్
Viral: Hrithik vs NTR tweets వైరల్: హ్రితిక్ vs ఎన్టీఆర్ ట్వీట్స్
Advertisement
Ads by CJ

నేడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డే. ఆయన లేటెస్ట్ ఫిలిమ్స్ నుండి అప్ డేట్స్, సెలబ్రిటీస్ విషెస్ తో ఎన్టీఆర్ ఫాన్స్ తడిచి ముద్దవుతున్నారు. ఇక ఆయన చేస్తున్న హిందీ ప్రాజెక్ట్ నుండి ఈరోజు అప్ డేట్ వస్తుందేమో.. అయాన్ ముఖర్జీ వార్ 2 లో ఎన్టీఆర్ కి సంబందించిన విషయమేదైనా రివీల్ చేస్తారేమో అని ఎన్టీఆర్ ఫాన్స్ ఆశగా ఎదురు చూసారు. అది జరగకపోయినా.. వార్ 2 లో ఎన్టీఆర్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్న హ్రితిక్ రోషన్ మాత్రం తారక్ కి బర్త్ డే విషెస్ చెబుతూనే వార్ 2 లోని కీలక విషయాలని రివీల్ చేసారు.

హ్యాపీ బర్త్ డే తారక్. ఈ హ్యాపీ డే ని నువ్వు ఎంజాయ్ చేయాలని, రాబోయే సంవత్సరంలో పూర్తి యాక్షన్ ప్యాక్ తో సాగాలని కోరుకుంటున్నా. యుద్ధభూమిలో నీ కోసం ఎదురు చూస్తున్నా మిత్రమా. మనం కలిసేంత వరకు నీకు ప్రతి రోజూ శాంతియుతంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా అంటూ హ్రితిక్ రోషన్ వార్ 2 నేపథ్యం ఎలా ఉండబోతుందో.. వారి మధ్యలో ఎంత భీకర యాక్షన్ ఘట్టాలు ఉండబోతున్నాయి ఈ ట్వీట్ లో రివీల్ చేసారు. అంతేకాకుండా ఎన్టీఆర్ కి హ్రితిక్ రోషన్ పుట్టిన రోజు శుభాకాంక్షలు మిత్రమా అంటూ తెలుగులో బర్త్ డే విషెస్ చెప్పడం అందరిని ఆకర్షించింది.

ఇక ఎన్టీఆర్ కూడా హ్రితిక్ రోషన్ కి అదిరిపోయే అద్భుతమైన రిప్లై ఇచ్చాడు. మీ లవ్లీ విషెస్ కి ధన్యవాదాలు సార్. మీరు కూడా రోజులు లెక్కబెట్టుకోండి. దాని గురించి ఆలోచిస్తూ చక్కగా నిద్రపోతున్నారని ఆశిస్తున్నా.. ఎందుకంటే మంచి విశ్రాంతితో యుద్ధ భూమిలో మిమ్మల్ని చూడాలనుకుంటున్నా.. త్వరలోనే కలుద్దామంటూ తారక్ హ్రితిక్ కి అదిరిపోయే రిప్లై ఇచ్చాడు. ఇప్పుడు వీరిద్దరి ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Viral: Hrithik vs NTR tweets:

Viral: Hrithik Roshan birthday wishes to NTR on Twitter

Tags:   HRITHIK ROSHAN, NTR
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ