అంటే సమంత తనకి మ్యాచ్ అయ్యే వ్యక్తి కోసం వెయిట్ చెయ్యడం లేదు, వెతకడం లేదు.. బాలీవుడ్ లో డాక్టర్ జెవల్ గమాడియాకి సరిపోయే సూటబుల్ మ్యాచ్ కోసం సమంత వెతుకుతున్నట్టుగా పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సమంత ప్రస్తుతం ముంబైలోనే ఎక్కువగా కనిపిస్తుంది. మాయోసైటిస్ వ్యాధి నుండి కోలుకుంటూ సిటాడెల్ వెబ్ సీరీస్ కోసం ఆమె తరుచూ ముంబై వెళుతుంది. తెలుగులో విజయ్ దేవరకొండతో ఖుషి మూవీ చేస్తున్న సమంత తాజాగా ఇన్స్టాలో తన డాక్టర్ జెవల్ గమాడియాకు మంచి జోడి వెతుకుతున్నట్టుగా పోస్ట్ పెట్టింది.
డాక్టర్ చాలా మంది వాడు.. తనకు సూటబుల్ అయ్యే వ్యక్తి కావాలంటూ పోస్ట్ పెట్టింది. అయితే ఈ డాక్టర్ జెవల్ బాలీవుడ్ లో చాలామంది సెలబ్రిటీస్ కి చికిత్స అందించే వ్యక్తి. బాలీవుడ్ టాప్ సెలబ్రిటీస్ అయిన అజయ్ దేవగణ్, అనుష్క శర్మ, కత్రినా కైఫ్ ఇలా చాలామంది ఆయన దగ్గరే ట్రీట్మెంట్ తీసుకుంటారు. ఇప్పుడు సమంత కూడా అదే డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ మొదలు పెట్టి అతనితో స్నేహం చెయ్యడమే కాకుండా అతనికో జోడి కూడా వెతుకుతుంది.
మరి ఎక్కడున్నా చాలా యాక్టీవ్ గా కనిపించే సమంత ఈ మధ్యన ప్యాన్ ఇండియా మూవీ శాకుంతలంతో బిగ్గెస్ట్ డిసాస్టర్ ని తన ఖాతాలో వేసుకుంది. ఇక హిందీ వెబ్ సీరీస్, సౌత్ మూవీలో బిజీగా కనిపిస్తుంది.