జబర్దస్త్ మొదలు పెట్టాక కమెడియన్ గా ఎంటర్ అయ్యి తర్వాత మెగా హీరోల స్పూఫ్స్ తో హైలెట్ అయ్యి టీం లీడర్ గా సత్తా చాటాడు శంకర్. షకలక శంకర్ గా టీం లీడర్ గా కామెడీ చేసిన పాపులర్ అయిన తర్వాత సిల్వర్ స్క్రీన్ మీద అవకాశాలు రాగానే అక్కడికి జంప్ అయ్యాడు. కమెడియన్ గానే కాదు హీరోగానూ అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. కానీ శంకర్ బుల్లితెర మీద పాపులర్ అయినట్టుగా వెండితెర మీద అంతగా క్రేజ్ సంపాదించలేకపోయాడు.
ప్రస్తుతం వెండితెర అవకాశాలు కూడా తగ్గాయి. అడపాదడపా సినిమాల్లో కనిపిస్తున్న షకలక శంకర్ సినిమా అవకాశాలు రాగానే జబర్దస్త్ కి పూర్తిగా బై బై చెప్పేసాడు. తాజాగా శంకర్ ఎక్స్ట్రా జబర్దస్త్ లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. బుల్లెట్ భాస్కర్ స్కిట్ లో వన్ అఫ్ ద కమెడియన్ గా స్కిట్స్ చేస్తున్నాడు. అయితే పర్మినెంట్ గా శంకర్ జబర్దస్త్ లో కనిపిస్తాడా.. లేదంటే కొద్దివారాలకే పరిమితమవుతాడా.. అనేది తెలియాల్సి ఉంది. కొత్తగా సదా జెడ్జ్ గా వస్తున్న ఎపిసోడ్ లో అంటే నిన్న శుక్రవారం ఎపిసోడ్ లో శంకర్ భాస్కర్ స్కిట్ లో కామెడీ చేసి నవ్వించాడు. వచ్చే వారం ప్రోమోలోను శంకర్ కనిపించాడు.
మరి వెండితెర అవకాశాలు తగ్గడంతోనే శంకర్ ఇలా జబర్దస్త్ కి రీ ఎంట్రీ ఇచ్చాడని చెప్పుకుంటున్నారు. సినిమా ఇండస్ట్రీలో ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించి పెట్టి అటు సంపాదన, ఇటు కీర్తి ప్రతిష్టలు తెచ్చిన జబర్దస్త్ మళ్ళీ వాళ్ళకి మరో లైఫ్ ని ఇస్తుంది అనే చెప్పాలి. చాలామంది కమెడియన్స్ జబర్దస్త్ ని వీడి మళ్ళీ రీ ఎంట్రీ కోసం చాలా ట్రై చేసి చివరికి జబర్దస్త్ స్టేజ్ పై ఇలా కనిపిస్తున్నారు.