తెలుగునాట తిరుగులేని స్టార్ హోదా నుంచి ఆర్.ఆర్.ఆర్ తో గ్లోబల్ స్టార్ గా ఎదిగిపోయిన ఎన్టీఆర్ బర్త్ డే నేడు. ఆ వేడుకలు కూడా అదే స్థాయిలో జరుగుతున్నాయి. ఓ వైపు అభిమానులు లక్షలాది ట్వీట్లతో, పోస్టులతో సోషల్ మీడియాని షేక్ చేసేస్తుంటే సెలబ్రిటీస్ కూడా లవ్ బుల్ విషెస్ తో ఫాన్స్ తో జాయిన్ అవుతున్నారు.
నిన్న విడుదలైన దేవర ఫస్ట్ లుక్ తో సంబరాలు జరుపుకుంటున్న అభిమానులు కేవలం శుభాకాంక్షలతోనే సరిపెట్టకుండా పలు సామాజిక సేవ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ తారకరాముని పుట్టిన రోజుని ఓ ఉత్సవంలా జరుపుతున్నారు.
ఇక ఈ వేడుకలకి తోడు అగ్నికి ఆజ్యంలా తోడైంది సింహాద్రి రీ రిలీజ్. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, ఓవర్సీస్ తేడా లేకుండా అన్ని చోట్ల థియేటర్స్ ముందు హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. బాణా సంచాలు కాలుతున్నాయి. నినాదాలు ప్రతి ధ్వనిస్తున్నాయి. ఈ హోరు జోరు చూస్తుంటే రీ రిలీజ్ సినిమాల్లో సరికొత్త రికార్డ్ తథ్యం అనిపిస్తుంది. ఇంతటి హంగామా తారక్ ఫాన్స్ కే సాధ్యంలా కనిపిస్తుంది.!
Once Again Happy Birthday to Sensational DEVARA NTR !!