Advertisement

నాగ్-మోహన్ బాబు మిస్ అవుతున్నారు

Fri 19th May 2023 08:21 PM
ntr centenary celebration  నాగ్-మోహన్ బాబు మిస్ అవుతున్నారు
Missing Nagarjuna and Mohan Babu నాగ్-మోహన్ బాబు మిస్ అవుతున్నారు
Advertisement

మే 20న హైదరాబాద్ లోని KPHP కైతలపూర్ గ్రౌండ్స్ లో ఎన్టీఆర్ సెంచరీ సెలెబ్రేషన్స్ కోసం ఏర్పాట్లు గ్రాండ్ గా మొదలైపోయాయి. నందమూరి ఫ్యామిలీ T.D జనార్దన్ ఆధ్వర్యంలో జరగనున్న ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు టాలీవుడ్ టాప్ స్టార్స్ హాజరవుతున్నారు. ఎన్టీఆర్ ఫ్యామిలీ ప్రత్యేకంగా యంగ్ అండ్ ప్యాన్ ఇండియా హీరోలని ఈ వేడుకకు కోసం ఆహ్వానించింది. ప్యాన్ ఇండియా స్టార్స్ ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్, అలాగే నందమూరి హీరో ఎన్టీఆర్ ని, ఇంకా పొలిటిషన్ కమ్ హీరో పవన్ కళ్యాణ్ గారిని ప్రత్యేకంగా ఆహ్వానించారు. అలాగే కళ్యాణ్ రామ్, విజయ్ దేవరకొండ, నితిన్, శర్వానంద్, విశ్వక్ సేన్, సిద్దు జొన్నలగడ్డ, రానా ఇలా యంగ్ హీరోలని, వెంకటేష్, బాలకృష్ణ లాంటి సీనియర్ హీరోలు కూడా ఈ ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు హాజరవుతున్న గెస్ట్ ల లిస్ట్ లో ఉన్నారు.

ఇక నారా చంద్రబాబు నాయుడు, టిడిపి ఎమ్యెల్యేలు, టిడిపి కార్యకర్తలు, నందమూరి అభిమానులు వేలాదిగాఈ వేడుకకి హాజరవుతున్నారు. టాలీవుడ్ టాప్ స్టార్స్ ఒకే స్టేజ్ పై కనిపించడం అంటే అభిమానులందరికి ఆనందమే. అయితే ఇక్కడ ఎన్టీఆర్ ని ఇష్టపడే మోహన్ బాబు పేరు కానీ.. ఎన్టీఆర్ తో ఎంతో అనుబంధం ఉన్న అక్కినేని ఫ్యామిలీ హీరోలు కానీ కనిపించడం లేదు. నాగార్జునకి మోహన్ బాబుకి అసలు ఎన్టీఆర్ సెంచరీ సెలెబ్రేషన్స్ ఇన్విటేషన్ అందిందా.. అందినా వారు రానన్నారా.. అనేది ఇప్పుడు అందరిలో ఉన్న కన్ఫ్యూషన్. ఇక మెగాస్టార్ చిరు తరపున పవన్ కళ్యాణ్, ఆయన కొడుకు రామ్ చరణ్ అటెండ్ అయితే సరిపోతుంది.

నాగార్జున కానీ, ఎన్టీఆర్ కి ఆప్తుడైన మోహన్ బాబు, ఆయన ఫ్యామిలీ నుండి విష్ణు, మనోజ్ కానీ ఈ ఈవెంట్ లో కనిపించే అవకాశం లేదు. అయితే ఈ ఈవెంట్ కి ఏయే హీరోలు ఖచ్చితంగా హాజరవుతారో క్లారిటీ లేదు కానీ.. ప్రస్తుతం మెట్రో పిల్లర్స్, సోషల్ మీడియాలో ప్రభాస్ దగ్గర నుండి అల్లు అర్జున్ వరకు, సిద్దు జొన్నలగడ్డ దగ్గర నుండి నితిన్ వరకు పోస్టర్స్ వేసి పబ్లిసిటీ చేస్తున్నారు.కేవలం ప్రభాస్, రామ్ చరణ్ వీళ్ళ ఫొటోస్ వేసి బ్యానర్ లు కట్టడం చూస్తే నాగార్జున, మోహన్ బాబు ఈ ఈవెంట్ కి రాకపోచ్చనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

Missing Nagarjuna and Mohan Babu:

Top movie stars for NTR Centenary Celebration

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement