Advertisementt

నా టైటిల్ కొట్టేశారంటున్న బండ్ల గణేష్

Fri 19th May 2023 05:14 PM
ntr30,devara  నా టైటిల్ కొట్టేశారంటున్న బండ్ల గణేష్
Bandla Ganesh claims to have beaten my title నా టైటిల్ కొట్టేశారంటున్న బండ్ల గణేష్
Advertisement
Ads by CJ

బండ్ల గణేష్ ఎప్పటినుండో పవన్ కళ్యాణ్ తో సినిమా చెయ్యాలని అనుకుంటూనే ఆయన కోసమే దేవర టైటిల్ ని రిజిస్టర్ కూడా చేయించాడు. పవన్ కళ్యాణ్ ఫాన్స్ తో సోషల్ మీడియాలో మీటింగ్ పెట్టినప్పుడు పవన్ తో దేవర ఎప్పుడు చేస్తారంటూ బండ్లని వారు ప్రశ్నించడం ఆయన సరదాగా సమాధానాలు చెప్పడం చూసాము. కానీ ఇప్పుడు అదే టైటిల్ తో ఎన్టీఆర్ ప్యాన్ ఇండియా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఎన్టీఆర్ -కొరటాల NTR30 కి దేవర టైటిల్ పెట్టేసినట్లుగా మీడియా పర్సన్ ఒకరు సోషల్ మీడియాలో ట్వీట్ వేశారు. ఎన్టీఆర్ కొత్త సినిమా టైటిల్ దేవర... దాని పోస్టర్ ఎలా ఉంది, దేవర అంటే.. అంటూ ఓ వ్యక్తి చేసిన ట్వీట్ చూసిన బండ్ల గణేష్ ఫన్నీగా రిప్లై ఇచ్చాడు.

దేవర నేను రిజిస్ట్రేషన్ చేయించుకున్న నా టైటిల్, నేను మర్చిపోవడం వల్ల నా టైటిల్ కొట్టేశారు 😡 అంటూ కోపంతో ఎన్న ఎమోజిని షేర్ చేసాడు. పవన్ కళ్యాణ్ కోసం తాను దాచుకున్న టైటిల్ ని మరిచిపోవడంతో ఎన్టీఆర్ తన కొత్త సినిమాకి ఈ టైటిల్ ని దొబ్బేసారు అంటూ గణేష్ సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నాడు. ఇంతకూ ఇక్కడ NTR ఫాన్స్ ఆనందపడాల్సిన విషయం ఏమిటంటే.. ఈ రోజు 7 గంటలకి రావాల్సిన టైటిల్ అప్పుడే సోషల్ మీడియా ద్వారా స్ప్రెడ్ అవడమే.

ఎన్టీఆర్ బర్త్ డే కి స్పెషల్ గా ఇక చూడాల్సింది ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ మాత్రమే. దేవర టైటిల్ తో ఎన్టీఆర్ విశ్వరూపం ఎలా ఉండబోతుందో అనేది మరికొద్దిసేపట్లో తెలిసిపోతుంది.

Bandla Ganesh claims to have beaten my title:

NTR30 title as Devara

Tags:   NTR30, DEVARA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ