సూపర్ స్టార్ రజినీకాంత్ కుమార్తె ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వంలో లైకా వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న క్రేజీ మల్టీస్టారర్ లాల్ సలా’. విష్ణు విశాల్, విక్రాంత్ హీరోలుగా నటిస్తోన్న ఈ చిత్రంలో సూపర్ స్టార్ రజినీకాంత్ కీలక పాత్రలో నటిస్తుండం మెయిన్ హైలైట్. రీసెంట్‌గా ముంబై డాన్ మొయిద్దీన్ భాయ్‌గా నటిస్తోన్న తలైవర్ లుక్‌ను చిత్ర యూనిట్ రివీల్ చేయగా ఎక్స్‌ట్రార్డినరీ రెస్పాన్స్ వచ్చింది. సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ ఎక్స్‌పెక్టేషన్స్‌ను తన ట్వీట్‌తో నెక్ట్స్ రేంజ్‌కు తీసుకెళ్లిపోయారు రజినీకాంత్.
తాజాగా ఆయన తన ట్విట్టర్‌లో లెజెండ్రీ క్రికెటర్, 1983లో తొలిసారి ఇండియాకు క్రికెట్ వరల్డ్ కప్‌ను సాధించిన పెట్టిన నాటి కెప్టెన్ కపిల్ దేవ్‌తో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేశారాయన. ‘లెజెండ్రీ పర్సన్, మనం అందరం ఎంతో గౌరవించాల్సిన గొప్ప మనిషి కపిల్ దేవ్‌జీతో కలిసి పని చేయటాన్ని గౌరవంగా భావిస్తున్నాను. క్రికెట్ వరల్డ్‌కప్‌ను సాధించి మన భారతదేశం గర్వపడేలా చేశారాయన అంటూ కపిల్ దేవ్‌తో వర్కింగ్ ఎక్స్‌పీరియెన్స్‌ను షేర్ చేసుకున్నారు రజినీకాంత్.
నటనలో లెజెండ్రీ పర్సనాలిటీ క్రికెట్ లెజెండ్‌ను ప్రశంసిస్తూ చేసిన సదరు ట్వీట్ హాట్ టాపిక్‌గా మారటమే కాదు.. నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మరో వైపు కపిల్ దేవ్ సైతం రజినీకాంత్‌తో ఉన్న ఫొటోను తన ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేస్తూ రజినీకాంత్‌గారితో కలిసి పని చేయటం గొప్ప గౌరవంగా భావిస్తున్నాను అన్నారు.