సముద్ర ఖని దర్శకత్వంలో పవన్ కళ్యాణ్-సాయి ధరమ్ తేజ్ కలయికలో క్రేజీ ఫిలిం గా మొదటిసారి తెరకెక్కుతున్న PKSDT టైటిల్ ని మేకర్స్ నిన్న మే 18 న రివీల్ చేసారు. పవన్ కళ్యాణ్ మోడరన్ గాడ్ గా బ్రో అవతార్ లో కనిపించబోతున్నారు. బ్రో మోషన్ పోస్టర్ తోనే సెన్సేషన్ క్రియేట్ చేసిన పవన్ కళ్యాణ్ బ్రో కి ఇప్పుడు డిజిటల్ పార్ట్నర్ కూడా సెట్ అయినట్లుగా తెలుస్తుంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రం జీ స్టూడియోస్ తో టై అప్ అయ్యింది.
అటు ఓటిటి పార్ట్నర్ గా బ్రో ని భారీ డీల్ తో ప్రముఖ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్ దక్కించుకున్నట్లుగా తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ క్రేజ్ కి ఈ ఓటిటి డీల్ తక్కువే అయినప్పటికీ సాయి ధరమ్ తేజ్ నుంచి చూస్తే అతని కెరీర్ లోనే ఇది బిగ్గెస్ట్ ఓటీటీ డీల్ అంటున్నారు. ఈ మూవీలో తేజ్ కి జోడీగా ప్రియా ప్రకాశ్ వారియర్, కేతిక శర్మ జోడీగా నటిస్తున్నారు. ఈ చిత్రం జులై 28 న విడుదల కాబోతుంది.