గత కొన్ని రోజులుగా హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్ ఎదుట లైగర్ డిస్ట్రిబ్యూటర్స్ రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. లైగర్ మూవీ వలన భారీగా నష్టపోయామని నిర్మాతలు పూరి జగన్నాథ్-ఛార్మి లు లైగర్ నష్టాలు ఎంతోకొంత పూడ్చాలని వారు డిమాండ్ చెయ్యగా ఆరు నెలల్లో సెటిల్ చేస్తామని మాటిచ్చి ఇన్ని రోజులైనా తమకి నష్టాలూ సెటిల్ చేయలేదంటూ వాళ్ళు రిలే నిరాహార దీక్షలకు దిగగా.. ఛార్మి కొద్దిరోజులు ఓపిక పడితే మొత్తం సెటిల్ చేస్తామని ఫిల్మ్ ఛాంబర్ కి మెయిల్ ద్వారా సమాచారం ఇచ్చినట్టుగా చెప్పారు.
అయితే తాజాగా నైజాం డిస్ట్రిబ్యూటర్స్ గురువారం అంటే ఈరోజు తమ ధర్నాని ముగించారు. నిర్మాతల మండలి, తెలుగు ఫిలిం ఛాంబర్ తమకి హామీ ఇవ్వడం వలనే తాము ధర్నా ఆపేశామని చెప్పారు. కొంతమంది బయ్యర్ల అనారోగ్య కారణాల దృష్ట్యా ఈ రిలే నిరాహార దీక్షలు విరమించినట్టుగా చెప్పుకొచ్చారు. పూరి జగన్నాథ్, ఛార్మీలు తమకి త్వరితగతిన న్యాయం చేస్తారని ఆశిస్తున్నామని వారు చెప్పుకొచ్చారు.