పవన్ కళ్యాణ్-సాయి ధరమ్ తేజ్ మొదటిసారిగా కలిసి నటిస్తున్న PKSDT టైటిల్ వచ్చేసింది. సముద్రఖని దర్శకత్వంలో తమిళ వినోదియం సిత్తం చిత్రానికి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం జులై 28 న విడుదల కాబోతుంది. అందుకే అప్ డేట్స్ కూడా చకచకా వచ్చేస్తున్నాయి. పవన్ కళ్యాణ్ గాడ్ కేరెక్టర్ లో కనిపిస్తున్న ఈ చిత్రానికి బ్రో టైటిల్ ని ఫిక్స్ చేసి మోషన్ పోస్టర్ తో పాటుగా రివీల్ చేశారు మేకర్స్.
పవన్ కళ్యాణ్ మోడ్రెన్ దేవుడిగా దర్శనమిచ్చినా.. దేవుడిగా పవన్ కళ్యాణ్ మోడ్రెన్ లుక్ లో అదిరిపోయారు. సాయి ధరమ్ తేజ్ లుక్ వదలకపోయినా.. బ్రో గా పవన్ కళ్యాణ్ ఎంట్రీకి పవన్ కళ్యాణ్ ఫాన్స్ మాత్రం థ్రిల్లయిపోతున్నారు. సముద్ర ఖని పవన్ కళ్యాణ్ ని పవర్ ఫుల్ గా చూపించబోతున్నట్లుగా క్లారిటీ వచ్చేసింది. ఇక ఈ చిత్రంలో పవన్ కేరెక్టర్ నిడివి చాలా తక్కువ. ఆయన కేరెక్టర్ కి సంబందించిన షూట్ 22 డేస్ లో ఫినిష్ చేసారు పవన్.