Advertisementt

పవన్-ఎన్టీఆర్ ఇప్పుడు వీళ్ళే క్రేజీ హీరోస్

Thu 18th May 2023 02:23 PM
pawan,ntr  పవన్-ఎన్టీఆర్ ఇప్పుడు వీళ్ళే క్రేజీ హీరోస్
Pawan-NTR are crazy heroes now పవన్-ఎన్టీఆర్ ఇప్పుడు వీళ్ళే క్రేజీ హీరోస్
Advertisement
Ads by CJ

ఇప్పుడు సోషల్ మీడియాలో ఇద్దరు హీరోల హావ కొనసాగుతుంది. వాళ్ళే పవన్ కళ్యాణ్-ఎన్టీఆర్ లు. ఎందుకంటే ఈ గురు శుక్రవారాల్లో సినిమాల రిలీజ్ ల కన్నా పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ సినిమాల నుండి బిగ్గెస్ట్ అప్ డేట్స్ రాబోతున్నాయి. పవన్-సముద్ర ఖని కలయికలో తెరకెక్కుతున్న రీమేక్ కి టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ మరికాసేపట్లో రాబోతుంది. దానితో గత రెండు రోజులుగా పవన్ కళ్యాణ్ PKSDT హాష్ టాగ్ ని ట్విట్టర్ లో పవన్ ఫాన్స్ ట్రెండ్ చేస్తున్నారు.

ఎన్టీఆర్ ఫాన్స్ కూడా NTR30 హాష్ టాగ్ ని గత నాలుగు రోజులుగా ట్రెండ్ చేస్తూ ఆయన బర్త్ డే కి రాబోతున్న అప్ డేట్ పై ఎగ్జైట్ అవుతున్నారు. మే 20 ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఒక రోజు ముందే అంటే రేపు NTR30 నుండి ఫస్ట్ లుక్ రివీల్ చెయ్యబోతున్నట్టుగా మేకర్స్ ఇచ్చిన అప్ డేట్ ఎన్టీఆర్ ఫాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. అందుకే ఎన్టీఆర్ ఫాన్స్ NTR30 హాష్ టాగ్ తో తెగ సందడి చేస్తున్నారు.

ప్రెజెంట్ పవన్ కళ్యాణ్-ఎన్టీఆర్ ల హడావిడే సోషల్ మీడియాలో కనబడుతుంది. #PKSDT, #NTR30 హాష్ టాగ్స్ తో అభిమానులు రచ్చ రచ్చ చేస్తున్నారు. ఇక PKSDT అప్ డేట్ వస్తే దానిని పవన్ ఫాన్స్ ఇంకాస్త రెచ్చిపోయి ట్రెండ్ చేస్తారు. రేపు NTR30 నుండి వస్తున్న అప్ డేట్ పై ఎన్టీఆర్ ఫాన్స్ ఇంట్రెస్టింగ్ గా ఎదురు చూస్తున్నారు. మరి ఈ రెండు రోజులు ఈ ఇద్దరి హీరోల హవా సోషల్ మీడియాలో చూసిన నెటిజెన్స్.. ప్రెజెంట్ ఈ హీరోలే క్రేజీ హీరోలు అంటూ కామెంట్ చేస్తున్నారు.

 

Pawan-NTR are crazy heroes now:

Pawan-NTR updates trending on twitter

Tags:   PAWAN, NTR
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ