Advertisementt

వార్ 2: ఎన్టీఆర్ రోల్ రివీల్డ్

Thu 18th May 2023 11:56 AM
ntr,war 2  వార్ 2: ఎన్టీఆర్ రోల్ రివీల్డ్
War 2: NTR Role Revealed వార్ 2: ఎన్టీఆర్ రోల్ రివీల్డ్
Advertisement
Ads by CJ

గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ ఇప్పుడు తెలుగు ప్రాజెక్ట్స్ మాత్రమే కాదు.. హిందీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఆర్.ఆర్.ఆర్ తో గ్లోబల్ స్టార్ గా మారిన ఎన్టీఆర్ బాలీవుడ్ మూవీతో మరింత క్రేజ్ సంపాదించుకున్నాడు. కొమరం బీమ్ గా ఇండియా వైడ్ ప్రేక్షకుల మనసులో గూడుకట్టుకున్న ఎన్టీఆర్ అదే స్థాయిలో హాలీవుడ్ స్టార్స్ ప్రశంశలు పొందాడు. ప్రస్తుతం #NTR30 షూటింగ్ లో నిమిషం తీరిక లేని తారక్.. నవంబర్ నుండి హిందీలో సైన్ చేసిన వార్ 2 షూటింగ్ లోకి ఎంటర్ అవుతాడు.

ఆయన్ ముఖర్జీ దర్శకత్వంలో హ్రితిక్ రోషన్ తో ఎన్టీఆర్ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ఏకంగా 30 కోట్ల పారితోషకం అందుకోబోతున్నాడనే న్యూస్ వినిపించింది. అయితే నిడివి తక్కువ ఉన్న పాత్రలో ఎన్టీఆర్ కనిపిస్తాడని, ఈ చిత్రంలో ఎన్టీఆర్ నెగెటివ్ షేడ్స్ ఉన్న కేరెక్టర్ లో కీలకంగా కనిపించనున్నాడంటూ బాలీవుడ్ మీడియా ఎక్స్ క్లూజివ్ కథనాలు ప్రచారంలోకి తెచ్చింది.

హ్రితిక్ రోషన్-ఎన్టీఆర్ మధ్యన భీకరమైన యాక్షన్ సన్నివేశాలు ఉంటాయని, అవే సినిమాకి హైలెట్ అవుతాయంటూ బాలీవుడ్ మీడియాలో వినిపిస్తున్న మాట. మరి ఎన్టీఆర్ నెగెటివ్ గా జై లవ కుశలో ఎలా ఉన్నాడో చూసిన తెలుగు ప్రేక్షకులకి, ఎన్టీఆర్ నెగెటివ్ కేరెక్టర్ ని బాలీవుడ్ ప్రేక్షకులకి వార్ 2 తో పరిచయం చెయ్యబోతున్నాడు.

War 2: NTR Role Revealed :

NTR negative shades in War 2

Tags:   NTR, WAR 2
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ