నందిని రెడ్డి దర్శకత్వంలో స్వప్న సినిమా బ్యానర్ లో వరస ప్లాప్ లతో సతమతమవుతున్న సంతోష శోభన్ హీరోగా తెరకెక్కిన అన్ని మంచి శకునములే మూవీ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శుక్రవారం కాకూండా ఒకరోజు ముందే గురువారమే ఈ చిత్రం విడుదలైంది. ఇప్పటికే ఓవర్సీస్ షోస్ కంప్లీట్ అవడంతో అన్ని మంచి శకునములే చిత్రం ఎలా ఉందో ట్విట్టర్ వేదికగా ఆడియన్స్ తమ అభిప్రాయాలని పంచుకుంటున్నారు.
ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన అన్ని మంచి శకునములే.. హీరో, హీరోయిన్ల మధ్య ప్రేమ గొడవలు జరగడం.. ఆ గొడవల ప్రభావం వాళ్ల కుటుంబాలపై పడడం వంటి డ్రామాతో ఈ మూవీ తెరకెక్కింది. ఓవర్సీస్ ఆడియన్స్ టాక్ చూస్తే.. ఫస్టాఫ్ బాగుంది. కాస్త నెమ్మదిగా సాగినట్లు అనిపించినా.. కామెడీతో పాటు కొన్ని మంచి సన్నివేశాలు ఆకట్టుకున్నాయి.. అని ఓ ఆడియెన్ ట్వీట్ చేస్తే.. మరో ఆడియెన్ అన్నీ మంచి శకునములే ఫస్ట్ హాఫ్ కన్నా సెకెండాఫ్ బాగుంది. కొన్ని సన్నివేశాలు సాగదీసినట్లు అనిపించాయి. స్లోగా సాగినట్లు ఉన్నా కొన్ని సీన్స్, క్లైమాక్స్ మాత్రం బాగున్నాయి.. అంటూ ట్వీట్ చేసాడు.
సినిమా ఓవరాల్ గా బావున్నా.. క్లైమాక్స్‌లో ఏదో మిస్ అయిందని నమ్మలేకపోతున్నాను. ఎమోషనల్‌గా క్లైమాక్స్ ద్వారా కనెక్ట్ అయ్యాను కానీ అంత ఇంపాక్ట్ చూపించలేదంటున్నారు మరికొందరు. కామెడీ, కొన్ని ఫీల్ గుడ్ సీన్స్ బాగున్నాయి. మిగిలినదంతా ల్యాగ్ అనిపించింది. జస్ట్ ఏవరేజ్ అంటూ తేల్చేస్తున్నారు ఇంకొందరు. ఎమోషన్స్, క్లైమాక్స్ బాగున్నా సాగదీసినట్లుగా ఉడడంతో బోర్ కొడుతుందని, ఓవరాల్ గా ఈ సినిమాకి మిక్స్డ్ రెస్పాన్స్ దక్కుతుంది అని మరికొంతమంది అభిప్రాయపడుతున్నారు.