యాంకర్ శ్రీముఖి కెరీర్ లో దూసుకుపోవడమే కాదు.. ఇప్పుడు ఖాళీ సమయాల్లో గోవా, బ్యాంకాక్, థాయిలాండ్ అంటూ ఎంజాయ్ చేసి వస్తుంది. ఫ్రెండ్స్ తో కలిసి గోవాలో ఎంజాయ్ చేసే శ్రీముఖి ఈసారి మాత్రం థాయిలాండ్ లో సింగిల్ గా దర్శనమిచ్చింది. పది రోజులపైనుండే శ్రీముఖి థాయ్ అందాలని ఎంజాయ్ చేస్తుంది. అక్కడ హోటల్ లో దిగినప్పటినుండి అక్కడ ఎలా ఉందో, తనెంతగా ఎంజాయ్ చేస్తుందో ఇలా అన్ని విషయాలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తుంది.
తాజాగా అక్కడ థాయ్ అందాలతో శ్రీముఖి అందాలు మిక్స్ అయ్యి క్యూట్ గా సీట్ గానే కాదు బ్యూటిఫుల్ గా మెరిసిపోయింది. కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని కత్తిలాంటి ఫోజ్ తో శ్రీముఖి ఫొటోలకి ఫోజులిచ్చి వాటిని Phuket! ✨ #photodump #sreemukhi #phuket #thailand #birthdaytrip అంటూ క్యాప్షన్ పెట్టి మరీ షేర్ చేసింది. యాంకరింగ్ చేస్తూ ఫుల్ బిజీగా మారిన శ్రీముఖి ఇప్పుడు నాజూగ్గా, అందాలు ఆరబోస్తుంది. గ్లామర్ షో చేస్తూ కిక్ ఇస్తుంది. బొద్దుగా, లడ్డులా ఉండే శ్రీముఖి ఇప్పుడు సన్నగా సన్నజాజిలా మారిపోయింది.
సన్నగా మారక గ్లామర్ గాను టర్న్ అయ్యింది. బుల్లితెర షోస్, వెండితెర మీద కేరెక్టర్ ఆర్టిస్ట్ గా జోరు పెంచింది. ఖాళీ సమయాల్లో ఇలా వెకేషన్స్ అంటూ ఎంజాయ్ చేస్తుంది.