Advertisementt

శర్వానంద్ పెళ్ళికి ముహూర్తం ఫిక్స్

Wed 17th May 2023 12:02 PM
sharwanand,rakshitha  శర్వానంద్ పెళ్ళికి ముహూర్తం ఫిక్స్
Royal Wedding For Sharwanand శర్వానంద్ పెళ్ళికి ముహూర్తం ఫిక్స్
Advertisement
Ads by CJ

నిన్నటివరకు శర్వానంద్ ఎంగేజ్మెంట్ బ్రేక్ అయ్యింది.. అందుకే నిశ్చితార్ధం జరిగి ఇన్ని రోజులవుతున్నా ఇంకా పెళ్లి ముహుర్తాలు పెట్టలేదంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో హడావిడి చెయ్యడం మొదలు పెట్టింది. పొలిటికల్ బ్యాగ్రౌండ్ ఉన్న రక్షిత రెడ్డి ని ప్రేమించి శర్వానంద్ ఈమధ్యనే అంగరంగ వైభవంగా స్నేహితులు, కుటుంభ సభ్యులు, సన్నిహితుల మధ్యన నిశ్చితార్ధం చేసుకున్నాడు. రామ్ చరణ్-ఉపాసన, చిరు-సురేఖ, అక్కినేని ఫ్యామిలీ, సిద్దార్థ్ ఆయన గర్ల్ ఫ్రెండ్ అదితి లు హాజరైన ఈ వేడుక హైదరాబాద్ లోనే గ్రాండ్ గా నిర్వహించారు.

అయితే నిశ్చితార్ధం జరిగిన చాలా రోజులవుతున్నా పెళ్లి కబురు చెప్పకపోయేసరికి అందరూ వారి ఎంగేజ్మెంట్ బ్రేక్ అయ్యింది అనుకుంటున్నారు. అయితే ఆ రూమర్స్ కి తెర దించుతూ నేడు మే 17 న శర్వానంద్ పెళ్ళికి ముహూర్తం ఫిక్స్ చేసి ఆ తేదీ, ఇంకా పెళ్లి జరిగే వేదికని ప్రకటించారు. శర్వానంద్ రాయల్ వెడ్డింగ్ చేసుకోబోతున్నాడు. జూన్ 3వ తేదీన రాజస్థాన్ జైపూర్‌లోని లీలా ప్యాలెస్‌లో రక్షితతో శర్వానంద్ వివాహం జరగనుంది. జూన్ 3 రాత్రి 11 గంటల నుంచి వివాహ వేడుక ప్రారంభమవుతుంది. 

రెండు రోజుల పాటు రాజస్థాన్ జైపూర్‌లోని లీలా ప్యాలెస్‌ లో శర్వానంద్ - రక్షితల వివాహం కుటుంభ సభ్యులు, రిలేటివ్స్, స్నేహితులు, సినీ ప్రముఖుల మధ్యన అంగరంగ వైభవంగా  జరగనుంది. అయితే నిశ్చితార్ధానికి-పెళ్ళికి ఇంతగా గ్యాప్ రావడానికి కారణం శర్వానంద్ కొత్త సినిమా షూటింగ్. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో రొమాంటిక్ కామెడీగా ఓ మూవీ చేస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన 40 రోజుల బిజీ షెడ్యూల్‌ను లండన్ లో పూర్తి చేసి ప్రస్తుతం శర్వానంద్ హైదరాబాద్‌కు తిరిగి వచ్చాడు. ఇకపై పెళ్లి పనుల్లో శర్వా నిమగ్నం కానున్నాడు.

Royal Wedding For Sharwanand :

Sharwanand Weds Rakshitha On June 3rd At Leela Palace In Jaipur

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ