ఎలాంటి అంచాలు లేకపోయినా.. ఆ చిత్రంపై వచ్చిన కాంట్రవర్సీ, బ్యాన్ చెయ్యాలనే నినాదాలతో క్రేజీగా సినిమా ప్రేక్షకుల్లోకి వెళ్లి ఇప్పుడు సూపర్ డూపర్ హిట్ కలెక్షన్స్ తో అదరగొట్టేస్తుంది అదా శర్మ నటించిన ది కేరళ స్టోరీ. విమల్ షా నిర్మాణంలో సుదీప్తో సేన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మే 5 న విడుదలైంది. అంచనాలు లేకుండా చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మలయాళ ఫిల్మ్ ని బ్యాన్ చెయ్యాలనే నినాదమే సినిమాని హిట్ చేసేసింది. 0.5 రేటింగ్, 1 రేటింగ్స్ అంటూ క్రిటిక్స్ ది కేరళ స్టోరీ కి పూర్ రివ్యూస్ ఇచ్చిన అది వివాదాల మధ్యన విడుదల కావడమే కలిసొచ్చింది.
కేరళ, తమిళనాడు ఇలా చాలా రాష్ట్రాలు ది కేరళ స్టోరీని బ్యాన్ చెయ్యాలమని అంటూ హడావిడి చేసాయి. పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ ప్రభుత్వం ది కేరళ స్టోరీ తమ రాష్ట్రంలో ఆడకుండా బ్యాన్ కూడా విధించింది. అయితే ఈ చిత్రం వసూళ్లు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. మొదటి రోజు పది కోట్లతో స్టార్ట్ అయిన ఈ కలెక్షన్స్ ఇప్పుడు 11 కోట్లు దాటేశాయి. దాంతో 11 రోజుల్లో ఈ సినిమా దాదాపుగా 130 కోట్లను రాబట్టినట్టు తెలుస్తుంది. ఈ విధమైన కలెక్షన్స్ సునామి కొనసాగితే ఈ చిత్రం అతి త్వరలోనే 200 కోట్ల మార్కును ఈ సినిమా అందుకోవడం గ్యారెంటీగా కనబడుతుంది.
ప్రతి రోజు ఈ సినిమా వసూళ్లు పెరుగుతూ వెళుతున్న నేపథ్యంలో, లాంగ్ రన్ లో వసూళ్ల పరంగా ఈ సినిమా కొత్త రికార్డులను సృష్టించవచ్చని అంటున్నారు. ఇదే విధంగా వసూలు సునామి వస్తుంటే కేరళ స్టోరీ ఓటిటి రిలీజ్ కూడా లేట్ అవ్వొచ్చని అంటున్నారు.