మెగా హీరో రామ్ చరణ్ ఉపాసనతో పెళ్ళై 11 ఏళ్ళు అయ్యింది. ఈ పదకొండేళ్లలో ఉపాసన-రామ్ చరణ్ లు తల్లితండ్రులు ఎప్పుడవుతారా, మెగా ఫ్యామిలీకి వారసుడెప్పుడొస్తాడో అని అందరూ అంటే అటు ఫ్యామిలీ ఇటు అభిమానులు ఎదురు చూడని క్షణం లేదు. గత ఏడాది ఉపాసన ప్రెగ్నెంట్ అన్న తర్వాత మెగా ఫ్యామిలిలో, మెగా ఫాన్స్ లో సంతోషం వెల్లు విరిసింది. అయితే ఉపాసన తల్లికాబోతుంది అని తెలియగానే ఆమె సరోగసి ద్వారా తల్లవుతుంది. ఇంతవరకు పిల్లలు కలగకపోవడంతో చరణ్ దంపతులు సరొగసీని సంప్రదించారంటూ ఏవేవో ఊహాగానాలు, ఉపాసన బేబీ బంప్ చూసేవరకు ఇదే రకమైన చర్చ సోషల్ మీడియా లో నడిచింది.
అయితే తాజాగా ఉపాసన తన ప్రెగ్నెన్సీపై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రామ్ చరణ్ తో పెళ్ళికి ముందే స్నేహపరమైన బంధం ఉంది. అందుకే చరణ్ నేను పెళ్ళికి ముందే పిల్లలని ఎప్పుడు ప్లాన్ చేసుకోవాలో డిసైడ్ చేసుకున్నాము. పెళ్ళైన కొత్తల్లోనే మేమిద్దరం మా ఎగ్స్ తీసి ఫ్రీజ్ చేసుకున్నాము, ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారో కూడా ఉపాసన క్లారిటీ ఇచ్చింది.
చరణ్ నెను కలిసి ఈ నిర్ణయం తీసుకున్నాము, ఎందుకంటే మేము మా కెరీర్ పై పూర్తిగా దృష్టి పెట్టాలనుకున్నాము, లైఫ్ లో సరైన సంపాదన తర్వాతే పిల్లకి మా జీవితంలోకి వెల్ కమ్ చెప్పాలనుకున్నాము. ఈ రోజు మేము సెటిల్ అయ్యి.. పిల్లలకి మా సంపాదనతో మంచి భవిష్యత్తుని ఇవ్వగలమనే నమ్మకంతో ఉన్నాము అంటూ ఉపాసన తన ప్రెగ్నెన్సీ సీక్రెట్స్ రివీల్ చేసింది.