ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తెలుగు దర్శకులతో అందులోను చిన్న దర్శకులతో సినిమాలు చేయరేమో అనుకున్న సమయంలో ఆయన ప్లాప్ డైరెక్టర్, చిన్న డైరెక్టర్ మారుతితో సినిమా మొదలు పెట్టి ఆయన ఫాన్స్ చేతిలోనే ఆయన ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. కంటెంట్ బావుంటే ఓకె.. లేదంటే ఏదైనా తేడా అయితే ఫాన్స్ చేతిలో ప్రభాస్ ఫాన్స్ కి మాములుగా ఉండదు. అదలా ఉంటే ఇప్పుడు మరి చిన్న దర్శకురాలు ప్రభాస్ తో ఓ సినిమా అవకాశం వస్తే బావుండు అంటుంది.
చిన్న సినిమాలతోనే సత్తా చాటుతున్న నందిని రెడ్డి తాజాగా అన్ని మంచి శకునములు తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. వచ్చే శుక్రవారం రిలీజ్ కాబోతున్న అన్ని మంచి శకునములు మూవీ ప్రమోషన్స్ లో నందిని రెడ్డి ప్రాజెక్ట్ K నెక్స్ట్ లెవెల్ మూవీ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన నందిని రెడ్డి చాలాకాలం తరువాత ఈమధ్యనే టీవీలో డార్లింగ్ సినిమా చూశాను. డార్లింగ్ లో ప్రభాస్ కొన్ని సీన్స్ ను ఎంతో క్యూట్ గా చేశాడు. ప్రభాస్ యాక్షన్ సీన్స్ ను ఎంత ఇంపాక్ట్ తో చేశాడో .. క్యూట్ అండ్ రొమాన్స్ సీన్స్ ను అంతే లవ్లీగా చేశాడు.
అప్పుడు అలా ఉన్న ప్రభాస్ ఇప్పుడు చాలా పెద్ద ప్యాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఒక చిన్న ప్రేమ కథతో.. ఒక యాక్షన్ ఎలిమెంటును పట్టుకుని ప్రభాస్ తో ఎప్పటికైనా ఒక సినిమా అయితే చేయాలనుంది అంటూ ప్రభాస్ తో సినిమా చెయ్యాలనే కోరికని బయటపెట్టింది.