కృతి శెట్టి ఒక్కప్పుడు లక్కీ హీరోయిన్. ఇప్పుడు మాత్రం ఐరెన్ లెగ్ లా తయారయ్యింది అంటూ ఆమెపై కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఉప్పెన మూవీ లాంటి బ్లాక్ బస్టర్ మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి కి వరసగా మూడు సినిమాల హిట్స్ అవడంతో హ్యాట్రిక్స్ హిట్స్ ఉన్న హీరోయిన్ గా లక్కీ గర్ల్ గా మరింది. ఇప్పుడు వరసగా నాలుగు డిజాస్టర్స్ ఉండడంతో పొగిడిన నోరులే తెగుడుతున్నాయి. ఐరెన్ లెగ్ అంటూ ముద్ర వేస్తున్నాయి.
అయితే తాజాగా కృతి శెట్టి తనకి ఇష్టమైన హీరోయిన్, హీరోలెవరో రివీల్ చెయ్యడమే కాదు.. తనకి కాబోయే వరుడికి ఉండాల్సిన లక్షణాలు కూడా బయటపెట్టింది. హీరోస్ లో రామ్ చరణ్, శివ కార్తికేయన్ అంటే ఇష్టమని చెప్పిన ఈ బ్యూటీ హీరోయిన్స్ లో అలియా భట్ అంటే చాలా ఇష్టమని చెప్పింది. ఇక తనకి కాబోయే వరుడికి డబ్బు లేకపోయినా, అందం లేకపోయినా పర్వాలేదు కానీ.. తనని పువ్వుల్లో పెట్టుకుని చూసుకునేవాడు కావాలంటుంది.
మంచి మనసుతో పాటుగా.. నిజాయితీగా.. అన్ని ఓపెన్ గా చెప్పేవాడు అయ్యి ఉండాలి. ఎంత ఎదిగినా ఒదిగినట్టుగా ఉండే మనస్తత్వంతో సింపుల్ గా ఉన్నప్పటికీ.. కాస్త బొద్దుగా ఉండే అమ్మాయి ఉంటే ఇంకా ఇష్టమంటూ కృతి శెట్టి కాబోయే వరుడి వివరాలు చెప్పుకొచ్చింది.