మహేష్ బాబు తన సినిమాల కోసం కొత్త లుక్స్ ని ఎక్కువగా ట్రై చెయ్యడు. ఆయన పోకిరి సినిమా తర్వాత అంత మాస్ యాంగిల్ కానివ్వండి, అంత మాస్ లుక్ కానివ్వండి మరి ఎందులోనూ కనిపించలేదు. నేనొక్కడినే కోసం సిక్స్ ప్యాక్ బాడీ ట్రై చేసి మహేష్ ఫెయిల్ అయ్యాడు. అయితే మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ తో చేస్తున్న మూవీకోసం కొత్త లుక్ లో కనిపించకపోయినా ఆయనలోని కొత్త యాంగిల్ని త్రివిక్రమ్ పరిచయం చెయ్యబోతున్నట్లుగా ఫస్ట్ లుక్ లోనే రివీల్ చేసి అబిమానులకి కిక్ ఇచ్చారు.
కొద్దిరోజులుగా వెకేషన్స్ లో ఉన్నాడు. మహేష్ బాబు ఫ్యామిలీతో గడిపే ప్రతి మూమెంట్ ని ఆయన సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటారు. కాని ఈసారి మహేష్ వెళ్లి చాలారోజులవుతున్నా మహేష్ ఫ్యామిలీ పిక్ కానీ, ఆయన సింగిల్ పిక్ కానీ బయటకి రాలేదు. ఇప్పుడు ఆయన సింగిల్ సెల్ఫీని పోస్ట్ చేసారు. అందులో మహేష్ కొత్తగా కనిపిస్తున్నాడు. హెయిర్ స్టయిల్ మార్చేశాడు. లాంగ్ హెయిర్ లో హాండ్ సం లుక్స్ తో మహేష్ బాబు సెల్ఫీ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
మహేష్ బాబు వెకేషన్స్ నుండి రాగానే.. ఈ నెల 31 న కృష్ణగారి పుట్టిన రోజుకి మహేష్ SSMB28 టైటిల్ రివీల్ చేసి గ్లిమ్ప్స్ తో ఫాన్స్ ని ఇంప్రెస్స్ చేసే ప్లాన్ లో మహేష్ మేకర్స్ ఉండగా.. SSMB28 తదుపరి షెడ్యూల్ జూన్ మొదటి వారంలో మొదలుపెట్టేలా మహేష్ కనిపిస్తున్నాడు.