కొంతకాలంగా ఐటి శాఖ సినిమా ఇండస్ట్రీపై ఫోకస్ పెట్టింది. గత ఏడాది డిసెంబర్ నుండే ఐటీ శాఖ అధికారులు టాలీవుడ్ ని వదలడం లేదు. టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థల చుట్టూ ఐటి దాడులు జరుగుతున్నాయి. రీసెంట్ గా మైత్రి మూవీస్ మేకర్స్, ప్రముఖ దర్శకుడు సుకుమార్ ఇళ్ళు, ఆఫీస్ లపై ఈ ఐటి సోదాలు జరిగాయి. సక్రమంగా జీఎస్టీ కట్టని కారణంగానే ఈ సోదాలు నిర్వహిస్తున్నారని, అలాగే హవాలా డబ్బు చేతులు మారుతున్నట్టుగా ఈ సోదాల్లో ఐటి అధికారులు గుర్తించారు.
ముంబైలోని మైత్రి ఆఫీస్ లోను ఐటి సోదాలు నిర్వహించారు. ఇక ఇప్పుడు ఈ ఐటి దాడులు కోలీవుడ్ లో మొదలయ్యాయి. తమిళనాట బడా నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్ ఆఫీస్ లు, సదరు నిర్మాతల ఇళ్లపై ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. చెన్నైలోని లైకా ప్రధాన కార్యాలయంతో పాటుగా మరో ఎనిమిది చోట్ల ఈడీ అధికారులు ఏకకాలంలో సోదాలు చేపట్టారు. తమిళనాట బడా సినిమాలను నిర్మించే లైకా ప్రొడక్షన్స్ వారు రీసెంట్ గా పొన్నియన్ సెల్వన్ 2 రిలీజ్ చేసారు.
ప్రస్తుతం చెన్నైలో లైకా ప్రొడక్షన్ పై జరుగుతున్న ఈడీ దాడులుపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. లైకా ప్రొడక్షన్ నుండి ఎలాంటి ప్రకటన అయితే ఈ దాడుల విషయంలో వెలువడలేదు.