ఆర్.ఆర్.ఆర్ తో గ్లోబల్ స్టార్ గా క్రేజ్ సంపాదించుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం క్రేజీ ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్స్ ని లైన్ లో పెట్టాడు. ప్రెజెంట్ కొరటాల శివ తో NTR30 సెట్స్ లో క్షణం తీరిక లేకుండా గడుపుతున్న ఎన్టీఆర్ నవంబర్ కల్లా హిందీ డెబ్యూ వార్ 2 షూటింగ్ లో జాయిన్ అవుతాడు. ఇక తదుపరి ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ ఉండనే ఉంది. అయితే ఎన్టీఆర్ సినిమా షూటింగ్స్, అలాగే యాడ్ షూట్స్ తోనే కనిపిస్తాడు కానీ.. అతనికి ప్రత్యేకించి ఫలానా వ్యాపారం ఉంది అని ఎక్కడ పెద్దగా ఎవ్వరికి తెలియదు.
కానీ అల్లు అర్జున్, మహేష్, రామ్ చరణ్ లాంటి హీరోలు చాలారకాల వ్యాపారాలు చేస్తూ చేతినిండా సంపాదిస్తున్నారు. లైక్ మహేష్, అల్లు అర్జున్ మల్టిప్లెక్స్ రంగంలో కనిపిస్తున్నారు. తాజాగా ఎన్టీఆర్ కూడా కొత్త వ్యాపారం మొదలు పెట్టబోతున్నాడట. కొంతమంది పార్ట్నర్స్ తో కలిసి ఎన్టీఆర్ ఓ ఫిల్మ్ స్టూడియోలో పెట్టుబడులు పెడుతున్నాడంటూ సోషల్ మీడియాలో ఒకటే హడావిడి. ఎన్టీఆర్ హైదరాబాద్ శివారు ప్రాంతమైన శంషాబాద్ దగ్గర కొంత మంది స్నేహితులతో కలిసి స్థలం కొని అందులో ఐదు అంతస్థులున్న స్టూడియోను నిర్మించారట. ఆ స్టూడియో లోనే ప్రస్తుతం ఎన్టీఆర్ నటిస్తోన్న NTR 30కి సంబంధించిన షూటింగ్ జరుగుతుంది కూడా.
ఎన్టీఆర్‌తో పాటు స్టూడియో బిజినెస్ లో ఇన్వెస్ట్ చేసిన పార్ట్నర్స్ కూడా సినిమా రంగంలోని ప్రముఖులే.. ఒకరేమో వివేక్ కూచిబొట్ల, మరొకరు నిర్మాత అభిషేక్ అగర్వాల్, ఇంకొకరు తాహిర్ టెక్నిక్ స్టూడియో. వీళ్లంతా కలిసి అక్కడ స్టూడియో నిర్మాణం చేపట్టినట్లుగా తెలుస్తుంది. దానిలోనే ఎన్టీఆర్ కోట్లు ఇన్వెస్ చేస్తున్నాడట. ఇప్పటికే అల్లు అర్జున్ ఆయన తండ్రి అల్లు అరవింద్ తో కలిసి అల్లు స్టూడియోకి శ్రీకారం చుట్టి ఓపెనింగ్ కూడా చేసారు. ఇప్పుడు ఎన్టీఆర్ మరో స్టూడియో మొదలెట్టేయబోతున్నాడన్నమాట.