నిన్నగాక మొన్న ఆచార్య డిసాస్టర్ విషయంలో మెగాస్టార్ చిరంజీవి దగ్గరనుండి అందరూ దర్శకుడు కొరటాల శివదే తప్పు అన్నట్టుగా మట్లాడారు. మెగాస్టార్ అయితే చాలాసార్లు కొరటాలని ఇండైరెక్ట్ గా టార్గెట్ చేసి మరీ అన్నారు. అసలు ఆచార్య ప్లాప్ తర్వాత కొరటాల శివ చాలారోజులు మీడియాకి మొహం చూపించలేకపోయారు. అంతలా ఆ సినిమా విషయంలో ఆయనని టార్గెట్ చేసారు.
తాజాగా ఏజెంట్ దర్శకుడు సురేందర్ రెడ్డి పరిస్థితి అదే మాదిరి తయారైంది. అఖిల్ హీరోగా అనిల్ సుంకర భారీ బడ్జెట్ తో నిర్మించిన ఏజెంట్ మూవీ ఏప్రిల్ 28 న రిలీజ్ అయ్యి ఘోరమైన ప్లాప్ ని మూటగట్టుకుంది. దానితో అనిల్ సుంకర ప్రేక్షకులకి సారి చెప్పాడు. అఖిల్ చాలా కష్టపడ్డాడు అన్నాడు. తాజాగా ఏజెంట్ ప్లాప్ పై అఖిల్ సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అయ్యాడు. అందులో తనకి సపోర్ట్ గా నిలిచిన అనిల్ సుంకరకి ధన్యవాదాలు చెప్పాడు.
మంచి సినిమా అందించలేకపోయామని ప్రేక్షకులకి సారి చెప్పాడు. ఏజెంట్ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి థాంక్స్ చెప్పాడు.. కానీ ఆ ట్వీట్ లో ఎక్కడా సురేందర్ రెడ్డిని ఇన్వాల్వ్ చెయ్యలేదు. అసలు దర్శకుడు విషయమే అఖిల్ లైట్ తీసుకున్నాడు. అనిల్ సుంకర, అఖిల్ ఇద్దరూ సురేందర్ రెడ్డిని కావాలనే సైడ్ చేసి.. డిసాస్టర్ కి బాద్యుణ్ణి చేసారు.
మరి ఏ సినిమా అయినా.. ఆ సినిమా ప్లాప్ కి దర్శకులే బలవుతున్నారు. లైగర్ విషయంలో డిస్ట్రిబ్యూటర్స్ పూరి జగన్నాథ్ ని వేపుకు తింటున్నారు. విజయ్ దేవరకొండ కూడా లైగర్ ప్లాప్ తర్వాత పూరితో చెయ్యాల్సిన జన గణ మనని ఆపేసాడు. అంటే అది వర్కౌట్ అవ్వదనేగా అతని ఉద్దేశ్యం.. ఇలా సినిమాల ప్లాప్ ల విషయంలో చివరికి దర్శకులే టార్గెట్ అవుతున్నారు.