టాలెంటెడ్ యాక్ట్రెస్ సాయి పల్లవి నటనకు ప్రాధాన్యమున్న పాత్రలతోనే హైలెట్ అయ్యింది. స్టార్ స్టేటస్ తెచ్చుకుంది. గ్లామర్ కి దూరంగా, కమర్షియల్ మూవీస్ కి దూరంగా ఉంటున్నప్పటికీ సాయి పల్లవి మాత్రం స్టార్ ఛాన్సెస్ దక్కించుకుంటూనే ఉంది. ఈమధ్యన కోలీవుడ్ లో రెండు సినిమాలు ఒప్పుకుని షూటింగ్స్ లో జాయిన్ అయ్యింది.
సాయి పల్లవి డాక్టర్ కమ్ యాక్టర్. ఆమె తన కెరీర్ లో ఎవరినీ ప్రేమించకపోయినా.. ఆమె చదుకునే రోజుల్లోనే ఒక అబ్బాయిని చూసి ఇష్టపడిందట. తాను ఏడో తరగతిలో ఉన్నప్పుడే తన క్లాస్ మేట్ అంటే ఇష్టం ఏర్పడి.. ఓ ప్రేమ లేఖ రాసి అతనికి ఎలా ఇవ్వాలో తెలియక పుస్తకాల్లో దాచుకుందట. కానీ ఆ ప్రేమ లేఖ తన తల్లి కంటపడడంతో ఆమె సాయి పల్లవిని ఉతికి ఆరేసిందట.
అదే తన తనని తల్లి మొదటిసారి కొట్టడం, అలాగే చివరి సారి కొట్టడం కూడా అదేనట. అప్పటినుండి ప్రేమ జోలికి పోలేదంటూ.. తన తల్లికి నచ్చని పని కూడా చెయ్యలేదు అంటూ సాయి పల్లవి ఓ ఇంటర్వ్యూలో ఫన్నీ కామెంట్స్ చేసింది.