మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ రోడ్ యాక్సిడెంట్ తర్వాత ఆయన నటించిన రిపబ్లిక్ మూవీ విడుదల కాగా.. ఆ సినిమాని అందరూ బావుంది అన్నా కమర్షియల్ గా మాత్రం రిపబ్లిక్ వర్కౌట్ కాలేదు. యాక్సిడెంట్ తర్వాత చాలారోజులు ఇంటికే పరిమితమైన సాయి ధరమ్ తేజ్ సుకుమార్ శిష్యుడు కార్తీక్ దండుతో విరూపాక్ష మూవీ చేసాడు. ప్రమోషన్స్ లో పంచె కట్టుతో సాయి తేజ్ హడావిడి చేసాడు. ఏప్రిల్ 21 న థియేటర్స్ లో విడుదలైన విరూపాక్ష మూవీ సూపర్ డూపర్ హిట్ అవడంతో మేకర్స్ చాలా హ్యాపీ గా ఫీలయ్యారు. దాదాపు 90 కోట్లపైనే విరూపాక్షకి కలెక్షన్స్ వచ్చాయి.
తెలుగులో సక్సెస్ అవడంతో విరూపాక్షని హిందీ, తమిళ, మలయాళ, కన్నడ లాంగ్వేజెస్ లో డబ్ చేసి మరీ ప్రమోట్ చేసి విడుదల చెయ్యగా.. తెలుగు ప్రేక్షకులు ఆదరించినట్టుగా మిగతా లాంగ్వేజ్ ప్రేక్షకులు విరూపాక్షని ఆదరించలేదు. ఇక సక్సెస్ అయిన సినిమాలు ఎదునిమిది వారాల గడువుతో ఓటిటిలోకి రావాలనే నియమం, నిర్ణయం తీసుకున్నాకే సూపర్ హిట్ దసరా నెలలోపే ఓటిటిలో విడుదల కాగా.. రావణాసుర, శాకుంతలం లాంటి ప్లాప్ సినిమాలు మూడు వారాలు తిరక్కుండానే ఓటిటిలోకి వచ్చేసాయి.
అయితే ఇప్పుడు హిట్ మూవీ విరూపాక్ష కూడా ఓటిటి డేట్ లాక్ చేసుకుంది. అది మే 21 నుండి విరూపాక్ష ఓటిటిలో స్ట్రీమింగ్ కి రాబోతుంది. ప్రముఖ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్ విరూపాక్ష హక్కులని దక్కించుకోగా.. మే 21న అఫీషియల్ గా ఓటిటిలోకి దించుతున్నట్టుగా నెట్ ఫ్లిక్స్ వారు అధికారికంగా ప్రకటించారు.