అఖిల్ అక్కినేని హీరోగా ఎంట్రీ ఇచ్చిన అఖిల్ మూవీ ఎంత ఘోరమైన డిజాస్టరో.. అఖిల్ లేటెస్ట్ చిత్రం ఏజెంట్ అంతకన్నా పెద్ద డిసాస్టర్ అవడం అఖిల్ కెరీర్ కాస్త దిగజార్చింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఏజెంట్ మూవీ ప్లాప్ అవడంతో అఖిల్ సైలెంట్ గా మారిపోయాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అనిల్ సుంకర భారీగా నిర్మించిన ఏజెంట్ మూవీ ఏప్రిల్ 28 న భారీ అంచనాల నడుమ విడుదలైంది. అక్కినేని ఫాన్స్ ని, మాస్ ఆడియన్స్ ని బాగా డిస్పాయింట్ చేసింది.
ఏజెంట్ మూవీ అంతగా ప్లాప్ అయ్యి ప్రేక్షకులు రిజెక్ట్ చెయ్యడంతో కలెక్షన్స్ పరంగా నిర్మాత అనిల్ సుంకరకి భారీ నష్టం వాటిల్లినా ఆయన ఏజెంట్ డిసాస్టర్ అయ్యింది, మేము ఎన్నో కష్టాలు పడి సినిమా చేసాము, కానీ ప్రేక్షకులు ఆదరించలేదు.. ఇలాంటి సినిమా చేసినందుకు మీకు క్షమాపణలు అంటూ చెప్పాడు. అయితే అఖిల్ మాత్రం ఏజెంట్ ప్లాప్ తర్వాత సైలెంట్ గా దుబాయ్ వెకేషన్స్ కి వెళ్లాడన్నారు. తాజాగా ఏజెంట్ ప్లాప్ పై అఖిల్ కూడా రియాక్ట్ అయ్యాడు.
సోషల్ మీడియాలో అఖిల్ ట్వీట్ చేస్తూ.. ఈ సినిమాకి ప్రాణం పొయ్యడానికి తమ జీవితాలని అంకితం చేసిన సిబ్బందికి, నటులకి హృదయపూర్వక ధన్యవాదాలు, మేము మా ప్రయత్నలోపం లేకుండా బెస్ట్ ఇవ్వడానికి కష్టపడ్డాము. కానీ దురదృష్టవసాత్తు ఆ సినిమా స్క్రీన్ పై మెప్పించలేకపోయింది. మేము మీ కోసం మంచి చిత్రాన్ని ఇవ్వలేకపోయాము. నాకు సపోర్ట్ గా నిలిచినందుకు మా నిర్మాత అనిల్ సుంకరకి ధన్యవాదాలు.
మా సినిమాపై నమ్మకం పెట్టిన డిస్ట్రిబ్యూటర్స్ కి, మాకు సపోర్ట్ చేసిన మీడియాకి ధన్యవాదాలు. నేను పని చెయ్యడానికి కారణం మీ ప్రేమ, శక్తి. నన్ను నమ్మినవారి కోసం బలంగా తిరిగివస్తాను అంటూ ట్వీట్ చేసాడు అఖిల్.