నాగ చైతన్య రీసెంట్ మూవీ కస్టడీ గత వారమే రిలీజ్ అయ్యింది. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు తెలుగు, తమిళంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అటు ఆడియన్స్ నుండి, ఇటు విమర్శకుల నుండి మిక్స్డ్ రివ్యూస్ తెచ్చుకున్న కస్టడీ మొదటి వీకెండ్‌లో ఓకే అనిపించినా.. సోమవారం వచ్చేసరికి బాగా వీకైపోయింది. 22 కోట్ల టార్గెట్‌తో బరిలోకి దిగిన నాగ చైతన్య ఆ మార్క్‌ని అందుకోవడం కష్టంగానే కనబడుతోంది.
శుక్రవారం విడుదలైన ఈ మూవీకి ఓపెనింగ్స్ పర్వాలేదనిపించాయి.. సెకండ్ డే, ఆదివారం పికప్ అవుతుంది అనుకుని సక్సెస్ మీట్ పెట్టి హడావుడి చేశారు కాస్త చిత్ర బృందం. కానీ మొదటి మూడు రోజులు సెలవు రోజులైనా సరే కస్టడీ ఎలాంటి ప్రభావం చూపించలేదు. ఇక వీకెండ్‌లో తేలిపోయిన ఈ సినిమా వీక్ డేస్‌లో నిలబడుతుందని అనుకోవడం భ్రమే అవుతుంది.
దానికి తగ్గట్టుగానే సోమవారం పలు థియేటర్స్ లో 30 శాతం ఆక్యుపెన్సీ కనిపించలేదు. టికెట్ బుకింగ్స్ కూడా దారుణంగా కనిపించాయి. వేసవి సెలవలైనా కస్టడీలో కంటెంట్ లేకపోవడంతో కలెక్షన్స్ పూర్తిగా పడిపోయాయి. సెలవులని క్యాస్ చేసుకోవడంలో కస్టడీ కంప్లీట్‌గా ఫెయిల్ అయ్యింది. థాంక్యూ-కస్టడీ బ్యాక్ టు బ్యాక్ ప్లాప్‌లతో నాగ చైతన్య కెరీర్ ప్రస్తుతం డల్ అయ్యిందనే చెప్పాలి.