నటి పూర్ణకి హీరోయిన్ గా సినిమా అవకాశాలు తగ్గినా. బుల్లితెరపై జెడ్జ్ ప్లేస్ లో కామెడీ షోస్ తోనో, లేదంటే డాన్స్ షోలోనో హడావిడి చేస్తూ ఎప్పడూ ప్రేక్షకుల మధ్యలోనే ఉండేది. పూర్ణ కొన్నాళ్లుగా కేరెక్టర్ ఆర్టిస్ట్ గా టర్న్ అయ్యి బాలకృష్ణ అఖండ లో, నాని దసరా మూవీస్ లో కీ రోల్ లో కనిపించింది. అయితే సినిమా షూటింగ్స్, బుల్లితెర షోస్ చేస్తూనే గత ఏడాది దుబాయ్ కి చెందిన వ్యాపారవేత్త అసిఫ్ అలీని ముస్లిం సంప్రదాయంలో పెళ్లాడింది. పూర్ణ తన పెళ్లికి కానీ, రిసెప్షన్ కి ఎవరిని పిలకుండానే కుటుంభ సభ్యులు, సన్నిహితుల మధ్యన అంగరంగ వైభవంగా వివాహం చేసుకుంది.
పూర్ణ పెళ్లికి ధరించిన నగలు, ఆమెకి పెళ్లి కానుకగా భర్త ఇచ్చిన గిఫ్ట్స్ అన్ని సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. ఇక ఈ ఏడాది పూర్ణ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. పూర్ణ బేబీ బంప్ ఫొటోస్, అలాగే కేరళ సంప్రదాయంలో జరిగిన శ్రీమంతం వేడుకలు అన్ని ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇక తనకి బేబీ పుట్టిన విషయాన్ని కూడా హాస్పిటల్ నుండి సోషల్ మీడియా ద్వారా అందరితో పంచుకుంది.కనిపిస్తుంది.
తాజాగా తన ప్రిన్స్ ఫస్ట్ పిక్ ని రివీల్ చేసింది. భర్త అసిఫ్ అలీ, పూర్ణ చేతిలో ఉన్న వాళ్ళ లిటిల్ ప్రిన్స్ నిజంగా చాలా ముద్దుగా కనిపించాడు.