Advertisementt

పూజ హెగ్డే కాబోయే భర్తకి ఉండాల్సిన క్వాలిటీస్

Mon 15th May 2023 11:14 AM
pooja hegde  పూజ హెగ్డే కాబోయే భర్తకి ఉండాల్సిన క్వాలిటీస్
Pooja Hegde Mother Lata Talks About The Qualities She Is Looking For In Her Son-in-law పూజ హెగ్డే కాబోయే భర్తకి ఉండాల్సిన క్వాలిటీస్
Advertisement
Ads by CJ

పూజ హెగ్డే కెరీర్ లో హిట్స్, ప్లాప్స్ తో సంబంధం లేకుండా దూసుకుపోతున్న హీరోయిన్. గత ఏడాది నాలుగు భారీ డిజాస్టర్స్ ఉన్నాయి, ఈ ఏడాది సల్మాన్ ఖాన్ కిసి కా భాయ్ కిసి కా జాన్ తో బిగ్గెస్ట్ ప్లాప్ అందుకున్న పూజ హెగ్డే కి బాలీవుడ్ లో షాహిద్ కపూర్ సరసన ఛాన్స్ రావడమనేది నిజంగా ఆమె అదృష్టమనే చెప్పాలి. ప్రస్తుతం బాలీవుడ్ లో షాహిద్ తో కోయి సాక్ మూవీ, తెలుగులో మహేష్-త్రివిక్రమ్ తో SSMB28 క్రేజీ ప్రాజెక్ట్ లో నటిస్తుంది.

అయితే ఈమధ్యన సల్మాన్ ఖాన్-పూజ హెగ్డే మధ్యలో సం థింగ్ సం థింగ్ అంటూ న్యూస్ రావడం అవి జస్ట్ రూమర్స్ అంటూ ఇద్దరూ కొట్టిపారెయ్యడం జరిగింది. ప్రస్తుతం బాయ్ ఫ్రెండ్ లేని పూజ హెగ్డే ని కట్టుకోబోయే వాడికి ఉండాల్సిన క్వాలిటీస్ ఏమిటో ఆమె తల్లి చెప్పింది. మదర్స్ డే సందర్భంగా పూజ హెగ్డే-ఆమె తల్లి మధ్యలో జరిగిన చర్చని పూజ హెగ్డే వీడియో రూపంలో షేర్ చేసింది. పూజ హెగ్డే ఎలాంటి వ్యక్తిని ఇష్టపడుతుంది అంటే.. తనని అన్ని రకాలుగా అర్ధం చేసుకోవాలి, తనని బాగా ఇష్టపడే వ్యక్తి కోసం ఆమె ఎదురు చూస్తుంది.

వివాహ బంధం అనేది కలకాలం నిలిచే బంధం. అందులో భార్య భర్తలు ఒకరినొకరు గౌరవించుకోవాలి, అర్ధం చేసుకోవాలి, గౌరవం ఇవ్వని వ్యక్తితో కలిసి ఉండడం వేస్ట్. ఆ బంధం ఎక్కువ కాలం నిలిచి ఉండదు. పూజ హెగ్డే చాలా సెన్సిటివ్. తనని బాగా చూసుకోవాలి. అన్ని విషయాల్లో జాగ్రత్తగా చూసుకోవాలి, కెరీర్ ని ఎంకరేజ్ చెయ్యాలి.. అలాంటి అబ్బాయి కావాలని పూజ హెగ్డే కోరుకుంటుంది అంటూ ఆమె తల్లి చెప్పుకొచ్చింది.

మరి ఈ క్వాలిటీస్ అన్నీ ఉన్న వ్యక్తి పూజ హెగ్డేకి ఎప్పుడు తారసపడతాడో చూడాలి. 

Pooja Hegde Mother Lata Talks About The Qualities She Is Looking For In Her Son-in-law:

Pooja Hegde mother Lata Hegde opens up about the qualities she is looking for in her future son-in-law

Tags:   POOJA HEGDE
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ