Advertisementt

టాలీవుడ్ హీరోలకి కోలీవుడ్ కష్టాలు

Wed 31st May 2023 02:17 PM
kollywood directors,tollywood heroes,flops,custody  టాలీవుడ్ హీరోలకి కోలీవుడ్ కష్టాలు
Kollywood Problems to Tollywood Heroes టాలీవుడ్ హీరోలకి కోలీవుడ్ కష్టాలు
Advertisement
Ads by CJ

కోలీవుడ్ హీరోలు టాలీవుడ్ దర్శకులతో సినిమాలు తీసి హిట్ కొడుతుంటే.. కోలీవుడ్ దర్శకులు మాత్రం టాలీవుడ్ హీరోలతో సినిమాలు చేసి ఫెయిల్ అవుతున్నారు. అందులో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్.. వంశీ పైడిపల్లితో చేసిన ‘వారిసు’ కోలీవుడ్‌లో హిట్ అయ్యింది. మరో స్టార్ హీరో ధనుష్.. వెంకీ అట్లూరితో ‘సార్’ మూవీ చేశాడు. అది సక్సెస్ అయ్యింది. కానీ కోలీవుడ్ దర్శకులు మాత్రం టాలీవుడ్ హీరోలకి సక్సెస్ ఇవ్వలేకపోతున్నారు. గతంలో మురగదాస్‌తో మహేష్ బాబు చేసిన స్పైడర్ అట్టర్ ఫ్లాప్ అయిన విషయం తెలిసిందే. ఇటీవల రామ్.. లింగుస్వామితో చేసిన ద్విభాషా చిత్రం ‘ద వారియర్’ అట్టర్ ప్లాప్ అయ్యింది.

తాజాగా నాగ చైతన్య తమిళ దర్శకుడు వెంకట్ ప్రభుతో చేసిన ‘కస్టడీ’ పరిస్థితి అలానే ఉంది. ద్విభాష చిత్రంగా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన ‘కస్టడీ’కి రెండు భాషల్లోనూ పాజిటివ్ టాక్ రాలేదు. విమర్శకులు సైతం కస్టడీ‌ని ప్లాప్‌గా తేల్చేశారు. టాలీవుడ్ దర్శకులని వదిలి కోలీవుడ్ దర్శకుల వెంట పడుతున్న కుర్ర హీరోలు ఇప్పుడు సక్సెస్‌కి బదులు ప్లాప్‌లని చవి చూడాల్సి వస్తుంది.

ప్రస్తుతం రామ్ చరణ్ కోలీవుడ్ టాప్ డైరెక్టర్ శంకర్‌తో ‘గేమ్ ఛేంజర్’ మూవీ చేస్తున్నాడు. ఇప్పుడీ సినిమాపైనే అందరూ ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా కనుక హిట్టు కొడితే.. కోలీవుడ్ దర్శకుల, టాలీవుడ్ హీరోల సెంటిమెంట్ విషయంలో కాస్త ఊపిరి పీల్చుకోవచ్చు.. లేదంటే సెంటిమెంట్ కంటిన్యూ అయినట్టే. 

Kollywood Problems to Tollywood Heroes:

One More Flop To Tollywood Hero From Kollywood Director

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ