కమెడియన్ బ్రహ్మనందం ఈమధ్యన రంగమార్తాండ సినిమాలో సీరియస్ కేరెక్టర్‌తో తనలోని మరో కోణాన్ని పరిచయం చేసారు. అయితే సినిమాల్లో కొన్నాళ్ళు గ్యాప్ తీసుకున్న బ్రహ్మి మరోసారి అవకాశాలతో బిజీ అవుతున్నారు. ఈ తరుణంలోనే అయన పొలిటికల్ ప్రచారంలో పాల్గొని అందరిలో ఆశ్చర్యం కలిగించారు. బ్రహ్మానందం కర్ణాటకలో కొద్ది రోజుల క్రితం జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. బిజెపి అభ్యర్థి మంత్రి డాక్టర్ సుధాకర్‌ని గెలిపించాలంటూ బ్రహ్మి రోడ్ షోలో తెగ ప్రచారం చేశారు.
కానీ కర్ణాటకలో బిజెపిని తొక్కేసి కాంగ్రెస్ అత్యధిక స్థానాల్లో గెలుపొందింది. చిక్ బళ్లాపుర నియోజకవర్గంలో బ్రహ్మానందం, సుధాకర్ రెడ్డి కోసం ప్రచారం చెయ్యగా.. సుధాకర్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి ప్రదీప్ ఈశ్వర్ చేతిలో ఓడిపోయాడు. సుధాకర్‌కి మద్దతిచ్చిన బ్రహ్మీ.. సుధాకర్‌తో తనకి కొన్నేళ్లుగా పరిచయం ఉందని.. ఆయన డాక్టర్‌గా, మంత్రిగా చేసిన సేవలు నచ్చి అయన తరుపున ప్రచారం చేసినట్లుగా చెప్పారు.
అయితే బ్రహ్మి మద్దతిచ్చిన సుధాకర్ ఓడిపోవడంతో బ్రహ్మి పొలిటికల్ ప్రచారం ప్లాప్ అయ్యింది అనేలా నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయినా సినిమా వాళ్లు ప్రచారం చేస్తే.. ఓట్లు పడే రోజులు ఎప్పుడో పోయాయి. సినిమా వాళ్లు నిలబడితేనే గెలవలేకపోతున్నారు.. ఇంక ప్రచారం చేస్తే ఓట్లు పడతాయా? అనేలా నెటిజన్లు చేస్తున్న కామెంట్స్‌తో బ్రహ్మీ పేరు మారుమోగుతోంది.