Advertisementt

శ్రీయ కష్టం పగవాడికి కూడా వద్దు

Mon 15th May 2023 08:57 PM
shriya saran,shriya,box office,flop,music school  శ్రీయ కష్టం పగవాడికి కూడా వద్దు
Shriya Saran Re Entry Film Flop at Box Office శ్రీయ కష్టం పగవాడికి కూడా వద్దు
Advertisement
Ads by CJ

శ్రియా శరన్ ఇంకా ఇంకా గ్లామర్ ఫీల్డ్‌లో దూసుకుపోవాలని కలలు కంటుంది. పెళ్లి తర్వాత భర్తతో పాటుగా విదేశాలకి వెళ్ళిపోయి సైలెంట్‌గా బిడ్డని కనేసి ప్రపంచానికి పరిచయం చేసేసిన శ్రీయ.. తనపై వచ్చే బాడీ షేమింగ్ ట్రోల్స్ తట్టుకోలేకే తాను ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని ఎవ్వరికి చెప్పకుండా దాచేసాను అంటూ చెప్పుకొచ్చింది. ఇక బిడ్డ పుట్టాక ఆమె అందాలు మరింతగా ఆరబోస్తూ గ్లామర్‌గా సోషల్ మీడియాని ఊపేసింది.

ఇంకా చెప్పాలంటే యంగ్ హీరోయిన్ మాదిరి చెలరేగిపోయింది. మ్యూజిక్ స్కూల్ అంటూ హడావిడి చేసింది. మ్యూజిక్ స్కూల్ ప్రమోషన్స్‌లో గ్లామర్‌గా అందాలు చూపిస్తూ అందరినీ అట్రాక్ట్ చేసింది. తానింకా గ్లామర్ హీరోయిన్‌నే అని చెప్పకనే చెబుతూ దర్శకనిర్మాతలకు సిగ్నల్స్ పంపించింది. అయితే నిన్న శుక్రవారం విడుదలైన మ్యూజిక్ స్కూల్ ప్రేక్షకులని ఇంప్రెస్ చెయ్యలేకపోయింది. సినీ విశ్లేషకులు సైతం మ్యూజిక్ స్కూల్‌పై చప్పని అభిప్రాయాలను షేర్ చేశారు. 

ప్రమోషన్స్ అంటూ ఎంతగా హడావిడి చేసిన మ్యూజిక్ స్కూల్‌ని ప్రేక్షకులు తిరస్కరించారు. శ్రీయ అందాల ఆరబోత మ్యూజిక్ స్కూల్ ఓపెనింగ్‌కి ఎలాంటి సహాయం చేయలేకపోయాయి. ఇదంతా చూసిన వారు.. అయ్యో శ్రీయ నీ కష్టం పగవాడికి కూడా వద్దు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Shriya Saran Re Entry Film Flop at Box Office:

Shriya Glamour Treat not Worked for Music School

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ