Advertisementt

ప్రియమణికి కస్టడీ హెల్ప్ అయ్యిందా?

Sun 14th May 2023 11:59 PM
priyamani,disappoint,custody,chief minister role,venkat prabhu  ప్రియమణికి కస్టడీ హెల్ప్ అయ్యిందా?
Priyamani Disappoints with Custody Result ప్రియమణికి కస్టడీ హెల్ప్ అయ్యిందా?
Advertisement
Ads by CJ

జాతీయ అవార్డు గ్రహీత మాజీ హీరోయిన్ ప్రియమణి నారప్ప సక్సెస్ తర్వాత మళ్ళీ పెద్దగా కనిపించలేదు. సీనియర్ హీరోలకి బెస్ట్ అప్షన్‌గా నిలవాల్సిన ప్రియమణిని వారు కూడా కన్సిడర్ చెయ్యడం లేదు. కొన్నాళ్ళు బుల్లితెర మీద ఢీ డాన్స్ షో కి జడ్జ్‌గా చేసిన ప్రియమణి ఆ తర్వాత ఢీ నుండి తప్పుకుంది. సినిమాల్లో అప్పుడప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుంది. తాజాగా నాగ చైతన్య కస్టడీ మూవీలో ప్రియమణి ఓ కేరెక్టర్ చేసింది.

ముఖ్యమంత్రిగా కనిపించిన ప్రియమణి చక్కగా ట్రెడిషనల్‌గా పొలిటికల్‌గా ఆ పాత్రలో ఒదిగిపోయినా.. ఆమెకిచ్చిన బిల్డప్ షాట్స్ ఎక్కువయ్యాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. కారణం ఆ కేరెక్టర్‌కి పవర్ ఫుల్ డైలాగ్స్ లేకపోవడమేనట. ఇక కస్టడీ హిట్ అయితే ప్రియమణికి కలిసొచ్చేది. కానీ కస్టడీ రిజల్ట్ తేడా కొట్టింది. నాగ చైతన్య, అరవింద్ స్వామి, కృతి శెట్టి, ప్రియమణి, శరత్ కుమార్ లాంటి బిగ్ స్టార్స్ ఉన్నప్పటికీ.. వారిని చాలా చిన్న పాత్రలకే సరిపెట్టడం ప్రేక్షకులకి నచ్చలేదు.

వెంకట్ ప్రభు కస్టడీ ని హ్యాండిల్ చెయ్యడంలో తడపడ్డాడు అంటున్నారు. నాగ చైతన్య పోలీస్ డ్రెస్‌లో చక్కగా నటించి, యాక్షన్ సీక్వెన్స్‌లో కష్టపడినా, కంటెంట్ లేకపోవడం సినిమాకి మైనస్ అయ్యింది, సాంగ్స్ చెత్తగా ఉన్నాయనే టాక్‌తో కస్టడీ ప్లాప్ లిస్ట్‌లోకి వెళ్లిపోవడంతో.. ప్రియమణి ఆశలపై నీళ్లు చల్లినట్లు అయ్యింది.

Priyamani Disappoints with Custody Result:

Priyamani Plays CM Role in Custody

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ