Advertisementt

ఈటీవీ స్టేజ్‌పై కొత్త యాంకర్స్

Sun 14th May 2023 10:32 PM
news anchors,manas,vishnu priya,etv  ఈటీవీ స్టేజ్‌పై కొత్త యాంకర్స్
News Anchors in ETV Stage ఈటీవీ స్టేజ్‌పై కొత్త యాంకర్స్
Advertisement
Ads by CJ

జబర్దస్త్‌కి అనసూయ, ఎక్స్ట్రా జబర్దస్త్‌కి రష్మీ గౌతమ్‌లు యాంకర్స్‌గా కొన్నేళ్లు కొనసాగారు. అనసూయ జబర్దస్త్ నుండి తప్పుకోవడంతో ఆ ప్లేస్ లోకి సౌమ్య రావు వచ్చి చేరింది. ఇక ఢీ డాన్స్ షోకి ప్రదీప్ మాచిరాజు యాంకరింగ్ చేస్తున్నాడు. సుధీర్, హైపర్ ఆది, జెస్సి, అఖిల్, రష్మి, వర్షిణి లాంటి వాళ్ళు మెంటర్స్ గా కనిపించేవారు. ఇక శ్రీదేవి డ్రామా కంపెనీ మొదలైన కొత్తలో సుడిగాలి సుధీర్ -రష్మిలు యాంకర్స్‌గా కనిపించేవారు. వారు కొన్నాళ్ళు తర్వాత తప్పుకోవడంతో ఎందరో యాంకర్స్ మారుతూ వచ్చారు. 

అయితే రేపు ఆదివారం ఈటీవీలో మథర్స్ డే ప్రోగ్రాం రాబోతుంది. ఈ ప్రోగ్రాం కి కొత్త యాంకర్స్ వచ్చారు. ఈ మధ్యన ప్రైవేట్ ఆల్బమ్స్‌తో అదరగొట్టేస్తున్న మానస్-విష్ణు ప్రియలు ఈటివి స్పెషల్ ప్రోగ్రాంలో యాంకర్స్ గా సందడి చేశారు. విష్ణు ప్రియ గతంలో యాంకరింగ్ చేసినా మధ్యలో హీరోయిన్‌గా ట్రై చేస్తూ యాంకరింగ్‌ని పక్కనపడేసి.. మానస్‌తో ప్రైవేట్ ఆల్బమ్స్‌లో డాన్స్ చేస్తూ ఫేమస్ అయ్యింది.

మానస్ బిగ్ బాస్‌తో క్లిక్ అయ్యి సీరియల్ హీరోగా మారాడు. వెండితెర అవకాశాలు రాకపోవడంతో బుల్లితెర మీద ఫిక్స్ అయిన మానస్, అలాగే విష్ణు ప్రియలు మథర్స్ డే ప్రోగ్రాంలో అదిరిపోయే యాంకరింగ్ చేస్తూ ఆకట్టుకున్నారు.

News Anchors in ETV Stage:

Manas and Vishnu Priya Hosts ETV Program

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ