బెల్లంకొండ సాయి శ్రీనివాస్ టాలీవుడ్ సినిమాలు చేస్తూ హీరోగా దిలదొక్కుకుంటూనే జయ జానకి నాయక చిత్రం హిందీ యూట్యూబ్‌లో రికార్డ్ వ్యూస్ రాబట్టడం, అలాగే ఆయన డబ్బింగ్ హిందీ చిత్రాలకి హిందీలో గిరాకీ ఉంటుంది అని.. ప్రభాస్-రాజమౌళిల బ్లాక్ బస్టర్ చిత్రం ఛత్రపతిని వినాయక్ దర్శకుడిగా హిందీలో రీమేక్ చేస్తూ బాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ చిత్రం ప్రమోషన్స్‌లో చాలా హడావిడి చేసాడు. అయితే నిన్న శుక్రవారం విడుదలైన బెల్లంకొండ శ్రీనివాస్ ఛత్రపతికి ఎలాంటి టాక్ వచ్చింది. హిందీలో ఛత్రపతి రివ్యూస్ ఎలా ఉన్నాయి అంటూ తెలుగు ఆడియన్స్ ఆసక్తి చూపించారు.
రీమేక్స్ ని పర్ఫెక్ట్ గా హ్యాండిల్ చేయగల వినాయక్ ఛత్రపతి రీమేక్‌ని ఎలా హ్యాండిల్ చేశాడు? ఒరిజినాలిటీని మిస్ అవ్వకుండా చేశాడా, రాజమౌళి మార్క్ నుండి కొత్తగా ఏమైనా చూపించాడా? అనే ఆసక్తి అందరిలో కనిపించింది. బాహుబలి తర్వాత ప్రభాస్ ఛత్రపతికి హిందీ ఆడియన్స్ యూట్యూబ్‌లో చూసెయ్యడంతో బెల్లంకొండ-వినాయక్ ఛత్రపతికి ఆడియన్స్ లైట్ తీసుకోవడంతో పూర్ ఓపెనింగ్స్ వచ్చాయి. అటు క్రిటిక్స్ కూడా ఛత్రపతికి పూర్ రివ్యూస్, రేటింగ్ ఇచ్చారు.
బెల్లంకొండ శ్రీనివాస్ యాక్షన్ పరంగా బెటర్‌గానే కనిపించాడు. ఇక హీరోయిన్‌కైతే ఎలాంటి స్పేస్ లేదు. బెల్లంకొండతో రొమాన్స్ చేసిన నుస్రత్ కి 3 సాంగ్స్ రెండు సీన్స్ మాత్రమే అన్నట్టుగా ఉంది. సినిమాలో హీరోయిన్ కన్నా మిగతా కేరెక్టర్స్ హైలెట్ అయ్యాయి. పెన్ స్టూడియోస్ బ్యానర్‌లో జయంతి లాల్ గడా, అక్షయ్ గడా, ధవల్ గడా భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రానికి దర్శకుడిగా వినాయక్ న్యాయం చేయలేకపోయాడనే టాక్ వినిపిస్తుంది.
ఛత్రపతి రీమేక్ అంత గొప్పగా ఏమి లేదంటూ పెదవి విరుస్తున్నారు. ఏదైనా స్ట్రయిట్ కథతో బెల్లంకొండ హిందీలో లాంచ్ అయినట్లయితే బావుండేది అంటూ నార్త్ ఆడియన్స్ ఫీలింగ్స్ ఉన్నాయి. సో దీనిని బట్టి బెల్లంబాబుకి బాలీవుడ్ అచ్చిరాలేదన్నమాటే కదా!