సౌత్‌లో స్టార్ హీరోలతో ప్రేక్షకులను చిట్టి నడుముతో ఊపేసిన ఇలియానా ఇప్పుడు సినిమా అవకాశాలు తగ్గిపోవడంతో బాలీవుడ్ వెళ్లిపోయింది. హిందీ ఇండస్ట్రీని నమ్ముకుని ముంబైకి మకాం మార్చిన ఇలియానా అక్కడ స్టార్ స్టేటస్‌ని తెచ్చుకోలేకపోయింది. తర్వాత ప్రేమ, బ్రేకప్, హెల్త్ ఇష్యుస్ అంటూ మదనపడింది. మధ్యలో తనని స్టార్ హీరోయిన్‌ని చేసిన సౌత్ ఇండస్ట్రీపై సెన్సేషనల్ కామెంట్స్ చేస్తూ హడావిడి చేసింది.
ఇక కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో కూడా కనిపించకుండా సైలెన్స్‌ని మెయింటైన్ చేసిన ఇలియానా గురించి సడెన్‌గా వచ్చిన ప్రెగ్నెన్సీ వార్తలు సోషల్ మీడియానే కాదు.. అభిమానులని సైతం షేక్ చేశాయి. ఇలియానా ప్రెగ్నెన్సీ అని తెలిశాక ఆమె పర్సనల్ లైఫ్, అలాగే ఆమె ఎవరిని పెళ్లి చేసుకుందో తెలియక ఆ విషయంలో నెటిజెన్స్ చాలా ఆతృతగా ఉన్నారు. ఇలియానా ఎవరి బేబికి తల్లవుతుంది అంటూ వెతుకుతున్నారు. ఇక ఇప్పటివరకు ఇలియానా బేబీ బంప్ ఫొటోస్ బయటికి రాలేదు.
కానీ తాజాగా ఇంస్టాగ్రామ్‌లో ఇలియానా బేబీ బంప్ పిక్స్ షేర్ చెయ్యగానే అవి వైరల్ అయ్యాయి. బ్లాక్ అవుట్ ఫిట్ లో బేబీ బంప్‌తో ఇలియానా చాలా యాక్టీవ్‌గా కనిపించింది. ప్రస్తుతం సినిమాలు లేకపోయినా ఇలియానా తన ప్రెగ్నెన్సీ వార్తలతో మీడియాలో కనిపిస్తుంది.