పూరి జగన్నాథ్-విజయ్ దేవరకొండ కలయికలో ఫ్యాన్ ఇండియా ఫిల్మ్ గా భారీ అంచనాలు మధ్యన విడుదలైన భారీ డిసాస్టర్ అయిన లైగర్ సినిమా.. పోయినందుకు బాధపడాలో.. బయ్యర్లు నష్టాలు కట్టమన్నందుకు బాధపడాలో అర్ధం కాక నిర్మాతలైన పూరి జగన్నాథ్-ఛార్మీలు తల పట్టుకున్నారు. పూరి జగన్నాథ్ ని లైగర్ నష్టాలు పూడ్చమంటూ చేసిన ఫోన్ కాల్స్ బయటపెట్టి పూరీని ఇరుకున పెట్టగా.. లైగర్ నష్టాలు ఎంతోకొంత ఇచ్చేస్తానని పూరి వాళ్ళకి మాటిచ్చి ఆరు నెలలు గడిచిపోయింది.
ఆరు నెలలైనా తమ డబ్బు వెనక్కి ఇవ్వలేదంటూ లైగర్ డిస్ట్రిబ్యూటర్స్ అంతా రోడ్డెక్కడం కాదు ఫిలిం ఛాంబర్ ముందు రిలే నిరాహార దీక్షలంటూ బ్యానర్ కట్టి టెంట్ వేశారు. తమకి న్యాయం చెయ్యాలంటూ లైగర్ బయ్యర్లు నానా గోల చేస్తున్నారు. అయితే ఈ ఇష్యుపై లైగర్ వన్ అఫ్ ద నిర్మాత ఛార్మి సప్పందించినట్టుగా తెలుస్తుంది. లైగర్ బయ్యర్లు చేస్తున్న గొడవ తమ దృష్టికి వచ్చిందని, త్వరలో వారికి అనుకూలంగా చర్యలు చేపడతామని చెప్పింది.
ఆ విషయాన్ని ఛార్మి ఫిల్మ్ చాంబర్ కు మెయిల్ ద్వారా విషయాన్ని తెలియజేసింది. త్వరలో లైగర్ తో నష్టపోయిన అందరికీ న్యాయం చేస్తామని ఛార్మి హామీ కూడా ఇచ్చినట్లుగా తెలుస్తుంది.