పూరి జగన్నాథ్-రామ్ కాంబోలో ఇస్మార్ట్ శంకర్ మాస్ హిట్ గా నిలవడంతో ఇప్పుడు మరోసారి ఈ కాంబో రిపీట్ అవుతుందని తెలిసిన దగ్గరనుండే పూరి-రామ్ మూవీపై అంచనాలు స్టార్ట్ అయ్యాయి. లైగర్ డిసాస్టర్ నుండి వెనువెంటనే బయటపడి రామ్ తో సినిమాని ఓకె చేయించుకుని స్క్రిప్ట్ పై కూర్చున్న పూరి జగన్నాథ్ రామ్ తో మూవీని మొదలు పెట్టేందుకు తహతహలాడుతున్నాడు. అయితే రామ్-పూరి మూవీ కన్ ఫర్మ్ అయినట్లుగా సోషల్ మీడియా వార్తలు తప్ప ఇంతవరకు అధికారిక ప్రకటన రాలేదు.
రామ్ మాత్రం బోయపాటితో చేస్తున్న ప్యాన్ ఇండియా మూవీ షూటింగ్ లో బిజీగా వుంటున్నాడు. బోయపాటి-రామ్ మూవీ దసరాకి రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా టైటిల్ అండ్ టీజర్ రామ్ బర్త్ డే స్పెషల్ గా మే 15 న రిలీజ్ చెయ్యబోతున్నట్టుగా టాక్ ఉంది. అయితే అదే రామ్ బర్త్ డే రోజు అంటే మే 15 న రామ్-పూరి కాంబో ప్రకటన కూడా రాబోతున్నట్లుగా తెలుస్తుంది. ఎంత త్వరగా వీలయితే అంత త్వరగా ఈ మూవీ షూటింగ్ మొదలు పెట్టెయ్యాలని పూరి అనుకుంటున్నాడట.
ఈ మూవీ పూర్తి చేసి లైగర్ నష్టాలని డిస్ట్రిబ్యూటర్స్ కి సెటిల్ చేసే ఆలోచనలో పూరి ఉన్నట్లుగా తెలుస్తుంది. ఒన్స్ రామ్.. బోయపాటి మూవీ ఫినిష్ చేస్తే పూరితో సెట్స్ లోకి వెళ్లిపోయేలా ప్లాన్ చేసుకుంటున్నారట.