ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాలీవుడ్ దర్శకుడు ఓమ్ రౌత్ తో చేస్తున్న ఆదిపురుష్ మూవీ రిలీజ్ కి రెడీ అయ్యింది. ఆదిపురుష్ షూటింగ్ కంప్లీట్ అయిన ఏడాదికి సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. జనవరిలోనే విడుదల కావాల్సిన ఆదిపురుష్ బెస్ట్ విజువల్ ఎఫెక్ట్ కోసం జూన్ 16 కి పోస్ట్ పోన్ చేసారు మేకర్స్. ఆదిపురుష్ టీజర్ తో విపరీతమైన నెగిటివిటీని మూటగట్టుకున్న ప్రభాస్ అండ్ ఓం రౌత్ లు.. మళ్ళీ ఆదిపురుష్ ట్రైలర్ తో దానిని ఎంతో కొంత దూరం చేసేసారు. మోడ్రెన్ రామాయణంగా ఆదిపురుష్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్టుగా ఓం రౌత్ ట్రైలర్ లోనే క్లారిటీ ఇచ్చేసాడు.
ఆదిపురుష్ ట్రైలర్ 3D వెర్షన్ అందరిని మెస్మరైజ్ చేసింది. అయితే ఆదిపురుష్ ట్రైలర్ కి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ రావడంతో ఓమ్ రౌత్ ప్రభాస్ తో కలిసున్న పిక్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. ప్రభాస్-ఓం రౌత్ లు 3డి గ్లాసెస్ పెట్టుకొని ఆదిపురుష్ ట్రైలర్ ని వీక్షిస్తున్న పిక్ అది. యే దోస్తీ అంటూ 3డి లో ఆదిపురుష్ ట్రైలర్ ని నా ఫ్రెండ్ తో చూస్తున్నా అంటూ ఓం రౌత్ ప్రభాస్ తో ఉన్న పిక్ ని షేర్ చేసాడు.
వీరిద్దరూ సింగిల్ ఫ్రేమ్ లో కళ్లజోడుతో కనిపించగానే ప్రభాస్ ఫాన్స్ ఆ పిక్ ని లైక్ లు షేర్ లతో ట్రెండ్ చేసి పడేసారు. ఇక ఓం రౌత్ ఆదిపురుష్ ట్రైలర్ రెస్పాన్స్ కి అందరికీ థాంక్స్ చెప్తున్నాడు.