Advertisementt

సమంత యశోద చూసా: చైతు

Thu 11th May 2023 08:21 PM
naga chaitanya,samantha  సమంత యశోద చూసా: చైతు
Samantha Yashoda saw: Naga Chaitanya సమంత యశోద చూసా: చైతు
Advertisement
Ads by CJ

నాగ చైత్యన్య-సమంత విడిపోయినప్పటికీ.. ఒకరి గురించి ఒకరు ఏం మాట్లాడతారా.. అసలు ఎందుకు విడిపోయారు.. విడిపోయాక ఎవరెవరు ఎలా ఉన్నారనే విషయంలో మీడియా కన్నా నెటిజెన్స్ ఎక్కువ ఆత్రం చూపిస్తున్నారు. అసలు ఈ జంట విడిపోవడం ఇప్పిటికి కొంతమంది జీర్ణించుకోలేకపోతున్నారు. కొంతమంది నాగ చైతన్యది తప్పు అంటే.. మరికొంతమంది సమంతది తప్పు అంటారు. కానీ ఎవరిది తప్పో అనేది వారిద్దరికి తెలియాలి. అయినప్పటికీ సమంతపై చైతు, చైతు పై సమంత చేసే కామెంట్స్ క్షణాల్లో వైరల్ అవుతున్నాయి.

తాజాగా కస్టడీ ప్రమోషన్స్ లో తనతో పని చేసిన హీరోయిన్స్ లో తనకి నచ్చిన క్వాలిటీ అంటే పూజ హెగ్డే లో ఆమె స్టయిల్ నచ్చుతుంది అని, కృతి శెట్టి లో అమాయకత్వం నచ్చుతుంది. ఆమె చాలామంచి అద్భుతమైన చిత్రాల్లో పని చెయ్యాలనుకుంటుంది. ఇక శృతి హాసన్ మల్టీటాలెంటెడ్. ఆమె పాట పాడితే చాలా బావుంటుంది. సాయి పల్లవి డాన్స్ నచ్చుతుంది. లవ్ స్టోరీ లో డాన్స్ రిహార్సల్స్ కోసం సాయి పల్లవితో ఎక్కువ సమయం కేటాయించాము. 

ఇక సమంత హార్డ్ వర్కర్. పరిస్థితులు ఎలా ఉన్న ధైర్యంగా ముందడుగు వేస్తుంది. మజిలీ తర్వాత సమంత నటించిన ఫ్యామిలీ మ్యాన్, ఓ బేబీ చిత్రాలు నచ్చుతాయి. గత ఏడాది సమంత యశోద కూడా చూసాను. ఏదైనా అనుకుంటే సమంత కచ్చితంగా చేసి తీరుతుంది.

Samantha Yashoda saw: Naga Chaitanya:

Naga Chaitanya Calls Ex-Wife Samantha Hard Worker

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ