Advertisementt

పవన్ ఫాన్స్ ని కూల్ చేస్తున్న హరీష్

Thu 11th May 2023 02:33 PM
ustaad bhagat singh,harish shankar  పవన్ ఫాన్స్ ని కూల్ చేస్తున్న హరీష్
Harish Shankar crazy tweets on social media పవన్ ఫాన్స్ ని కూల్ చేస్తున్న హరీష్
Advertisement
Ads by CJ

హరీష్ శంకర్ కొద్దిరోజులుగా పవన్ కళ్యాణ్ ఫాన్స్ చేసే ట్రోల్స్ లో సతమవుతూనే వారికి ధీటుగా సమాధానమిస్తున్నాడు. ఒకవేళ హరీష్ శంకర్ తేరి రీమేక్ చేస్తుంటే ఓపెన్ గా చెప్పమని, అసలు విజయ్ తెరిని చాలాసార్లు తెలుగులో చూసేసారు అది పవన్ కళ్యాణ్ తో వర్కౌట్ అవ్వదని మొత్తుకుంటున్నారు. ఈ రీమేక్ ఒప్పుకున్నందుకు పవన్ ని అనడం మానేసి హరీష్ శంకర్ పై ఫైర్ అవుతున్నారు. తనని ట్రోల్ చేసే వారు, సోషల్ మీడియాలో తిట్టేవారు అసలు పవన్ ఫాన్స్ కాదంటాడు హరీష్ శంకర్. 

అయితే పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ మొదలు పెట్టేసాడు. ఇప్పటికే ఓ షెడ్యూల్ పూర్తి చేసేసాడు. ఓ వారం పాటు ఉస్తాద్ రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొన్న పవన్ కళ్యాణ్ తర్వాత OG కి వరసగా డేట్స్ ఇస్తూ పోతున్నారు. కానీ హరీష్ శంకర్ మాత్రం ఉస్తాద్ భగత్ సింగ్ వారం షూట్ కే గ్లింప్స్, పవన్ కళ్యాణ్ పోస్టర్ అంటూ సోషల్ మీడియాలో చేసే హడావిడి అంతా ఇంతా కాదు. పవన్ ఫాన్స్ ని కూల్ చెయ్యడానికి ఐదు నిమిషాలకో ట్వీట్ వేస్తూ రచ్చ చేస్తున్నాడు. మనల్ని ఎవడ్రా ఆపేది.., మన జోలికొస్తే బ్రదరూ... మంటెత్తి పోద్ది వెదరూ……. 😍😍😍 అంటూ పవన్ ఫాన్స్ లో ఊపుతెస్తున్నాడు.

ఉస్తాద్ భగత్ సింగ్ గ్లిమ్ప్స్ కన్నా ముందే పవన్ లుక్ అంటూ చేసిన హాడావిడితో సోషల్ మీడియా హోరెత్తిపోయింది. మరి వారం రోజుల షూట్ కే అందరి అటెన్షన్ ఉస్తాద్ భగత్ సింగ్ పై పడేలా పర్ఫెక్ట్ ప్లానింగ్ తో హరీష్ చేస్తున్న ప్రయత్నాన్ని మాత్రం మెచ్చుకోవలసిందే.

Harish Shankar crazy tweets on social media :

Ustaad Bhagat Singh Director Harish Shankar crazy tweets on social media

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ