Advertisementt

ట్రెండింగ్ లో సమంత డిసాస్టర్ మూవీ

Thu 11th May 2023 12:25 PM
shaakuntalam  ట్రెండింగ్ లో సమంత డిసాస్టర్ మూవీ
Shaakuntalam hashtag trending on twitter ట్రెండింగ్ లో సమంత డిసాస్టర్ మూవీ
Advertisement
Ads by CJ

సమంత ప్యాన్ ఇండియా మూవీగా ఎన్నో హోప్స్ పెట్టుకున్న శాకుంతలం ఏప్రిల్ 14 న రిలీజ్ అయ్యి ప్రేక్షకుల ముందుకు రాగా.. ఆ చిత్రాన్ని ప్రేక్షకులు తిరస్కరించారు. గుణశేఖర్ రుద్రమదేవి తర్వాత మళ్ళీ 3D గ్రాఫిక్స్ తో శాకుంతలాన్ని రెడీ చెయ్యగా.. ప్రేక్షకులకి ఆ చిత్రం అస్సలు రుచించలేదు. సమంత సింపతీ శాకుంతలానికి వర్కౌట్ అవ్వలేదు. యశోద సమయంలో ఆమె మాయోసైటిస్ వ్యాధి కారణంగా ప్రేక్షకులు జాలి చూపించారు. కానీ శాకుంతలానికి అవేం పని చెయ్యలేదు.

ఇక ఏప్రిల్ 14 న థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ చిత్రం గత అర్ధరాత్రి నుండి అమెజాన్ ప్రైమ్ నుండి ఓటిటి ఆడియన్స్ కి అందుబాటులోకి వచ్చింది. అయితే శాకుంతలం ఏప్రిల్ 12 అంటే రేపు ఓటిటిలోకి రావాల్సి ఉంది. కానీ ఇప్పుడు ఒక్కరోజు ముందే సౌండ్ లేకుండానే ఓటిటిలో శాకుంతలం ప్రత్యక్షమవడంతో ఇప్పుడు ఈ మూవీని సోసివిల్ మీడియాలో ట్రెండ్ చేయిస్తున్నారు. అది చూసిన నెటిజెన్స్ సమంత డిసాస్టర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుందిరా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

నిజంగానే ట్విట్టర్ లో శాకుంతలం హాష్ టాగ్ తెగ ట్రెండ్ అవుతుంది. అందుకే నెటిజెన్స్ ప్లాప్ మూవీకి సోషల్ మీడియాలో ఇంత క్రేజా అని షాకవుతున్నారు. గత నెలలో రవితేజ డిసాస్టర్ మూవీ రావణాసుర కూడా ఇదే మాదిరిగా ట్రెండ్ అయ్యింది. అదో పెద్ద డిసాస్టర్ మూవీ కావడమే నెటిజెన్స్ ని ఆశ్చర్యపరిచింది.

Shaakuntalam hashtag trending on twitter:

Shaakuntalam hashtag trends on twitter

Tags:   SHAAKUNTALAM
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ