Advertisementt

పారితోషకాలపై రకుల్ సంచనల కామెంట్స్

Thu 11th May 2023 11:16 AM
rakul preet  పారితోషకాలపై రకుల్ సంచనల కామెంట్స్
Rakul sensational comments on remuneration పారితోషకాలపై రకుల్ సంచనల కామెంట్స్
Advertisement
Ads by CJ

హీరోయిన్ రకుల్ ప్రీత్ హడావిడి సౌత్ లో పూర్తిగా తగ్గిపోయింది. తెలుగులో స్టార్ హీరోల అవకాశాలతో రఫ్ఫాడించిన రకుల్ ప్రీత్ కి నాలుగైదేళ్లుగా ఒక్క అవకాశం కూడా స్టార్ హీరోలు ఇవ్వడం లేదు. కనీసం యంగ్ హీరోలు కూడా రకుల్ ప్రీత్ ని కన్సిడర్ చెయ్యడమే లేదు. అప్పుడప్పుడు హిందీ సినిమాలతో సందడి చేసే రకుల్ కి అక్కడ కూడా బ్రేక్ ఇచ్చే సినిమా దొరకడం లేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం రకుల్ చాలా యాక్టీవ్ గా గ్లామర్ పిష్ పోస్ట్ చేస్తూ ఉంటుంది.

అయితే సినిమాల్లో హీరోల పారితోషకాలు, హీరోయిన్స్ పారితోషకాలపై చాలామంది హీరోయిన్స్ అసంతృప్తిగా ఉంటున్నారు. అందులో భాగంగానే చాలామంది హీరోయిన్స్ ఈ విషయంలో గొంతు కూడా విప్పుతున్నారు. ఈమధ్యన శాకుంతలం ప్రమోషన్స్ లో మా కష్టానికి ప్రతి ఫలం నిర్మాతలు పారితోషకంగా డిసైడ్ చేస్తే బావుంటుంది అంటూ మాట్లాడింది. తాజాగా రకుల్ కూడా ఓ భేటీలో లో పాల్గొన్నప్పుడు పారితోషకాలపై సెన్సేషనల్ కామెంట్స్ చేసింది.

హీరోల కన్నా హీరోయిన్స్ కి పారితోషకాలు తక్కువగా ఉంటున్నాయి. నిజం చెప్పాలంటే హీరోలకి సరిసమానమైన ప్రతిభ ఉంటుంది. వారి ప్రతిభని బట్టే పారితోషకాలు డిసైడ్ చెయ్యాలి. అలా కాకుండా హీరోలకి ఎక్కువ పారితోషకాలు ఉంటున్నాయి. హీరో-హీరోయిన్స్ ఒకేలా శ్రమిస్తారు. కానీ హీరోల పారితోషకాలు మాత్రం ఎక్కువ ఉంటున్నాయి. ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పించే కెపాసిటీ హీరోయిన్స్ కి కూడా ఉంటుంది కానీ పారితోషకాల విషయంలో ఈ వ్యత్యాసాలు బాలేదు అంటూ సంచలన కామెంట్స్ చేసింది.

Rakul sensational comments on remuneration:

Rakul Pret comments on remuneration

Tags:   RAKUL PREET
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ